పోలీసుల అదుపులో యాంక‌ర్ ర‌వి!

పోలీసుల అదుపులో యాంక‌ర్ ర‌వి!

ప్ర‌ముఖ బుల్లితెర న‌టుడు.. యాంక‌ర్ గా సుప‌రిచితుడు.. త‌న ఎట‌కార‌పు మాట‌ల‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించే యాంక‌ర్ ర‌విని ఎస్ ఆర్ న‌గ‌ర్ పోటీసులు అదుపులోకి తీసుకున్నారు. సందీప్ అనే డిస్ట్రిబ్యూట‌ర్ ఇచ్చిన కంప్లైంట్ నేప‌థ్యంలో అత‌న్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బాకీ వ‌సూలుకు యాంక‌ర్ ర‌వి త‌న‌ను బెదిరించార‌ని.. 20 మందిని తీసుకొని ఇనుప‌రాడ్ల‌తో దాడికి య‌త్నించిన‌ట్లుగా పేర్కొన్నారు. అంతేకాదు.. ఫోన్లో యాంక‌ర్ ర‌వి త‌న‌ను బెదిరిస్తున్న‌ట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితుడు వెల్ల‌డించారు.

త‌మ‌కు అందిన స‌మాచారం మేర‌కు.. ప్రాధ‌మిక ఆధారాల్ని ప‌రిశీలించిన ఎస్ ఆర్ న‌గ‌ర్ పోలీసులు.. అత‌డ్ని అదుపులోకి తీసుకున్న‌ట్లు చెబుతున్నారు. ఫిర్యాదుదారు ఇచ్చిన వివ‌రాల‌తో యాంక‌ర్ ర‌విని ప్ర‌శ్నిస్తున్నారు. సెల‌బ్రిటీ ఇమేజ్ వస్తే మాత్రం.. అలా రాడ్లు ఇచ్చేసి పంపేస్తే.. పోలీసులు.. చ‌ట్టం లాంటివి ఉంటాయ‌న్న విష‌యాన్ని యాంక‌ర్ ర‌వి మ‌ర్చిపోయారా?  అన్న క్వ‌శ్చ‌న్లు వినిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English