కాంగ్రెస్ మార్క్ రాజ‌కీయం

కాంగ్రెస్ మార్క్ రాజ‌కీయం

కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్ర‌తిప‌క్షాల మ‌ద్ద‌తుతో ఏర్పాటుచేసిన ప్రజాకూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కిరావటం లేదు. చాలా స్థానాల్లో తామే బలమైన శక్తిగా చెప్పుకొంటుండటంతో పరిష్కారం జటిలమవుతున్నది. ఎవరికివారు తమ వాదనలకే కట్టుబడి ఉండటంతో నిరంతర చర్చలు జరుపుతున్నా.. ఎవరెన్ని సీట్లకు?
అందులోనూ ఏయేస్థానాల్లో పోటీచేయాలన్న విషయంలో స్పష్టత రావటంలేదు. అయితే, ఇదే స‌మ‌యంలో అనూహ్యమైన టాపిక్ ఒక‌టి తెర‌మీద‌కు వ‌చ్చింది. అదే టీజేఎస్‌ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే కోదండరామ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామ‌నే ప్ర‌తిపాద‌న‌. అయితే, ఇది ఆచ‌ర‌ణ సాధ్య‌మేనా అంటూ ప‌లువురు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.

కాంగ్రెస్‌, టీడీపీ, తెలంగాణ జన సమితి, సీపీఐ ఈ నాలుగూ మహాకూటమిగా ఏర్పడ్డాయి. అయితే, సీట్ల సర్దుబాటు ఎడ‌తెగ‌ని ప్ర‌క్రియ వ‌లే సాగుతూనే ఉంది. ఈ క్ర‌మంలో మిగ‌తా పార్టీల కంటే బెట్టు మీదున్న‌ది టీజేఎస్‌. `ఉద్యమం నుంచి వచ్చిన వాళ్లం.. ఏమైనా చేయగలం అని ప్రొఫెసర్‌ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న్ను త‌మ‌దారిలోకి తెచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్ర‌య‌త్నిస్తోంద‌ని టాక్‌. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే కోదండరాంకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తమని వారితో బేరం మొదలెట్టారు.

అయితే, దీనికి కోదండ‌రాం స్పంద‌న‌పై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. మ‌రోవైపు ఇదిలా ఉండగా కాంగ్రెస్‌లోనే సీఎం, డిప్యూటీ పోటీలో అరడజనుకు పైనే ఉన్నారనేది బహిరంగ చర్చ. ఓ పక్క సీట్ల సర్దుబాటు కాక తనకే ఆ సీటంటే, కాదు.. తనకేనంటూ ప్రచారం చేసుకునే ఆశావహులతో త‌ల‌బొప్పి క‌డుతుంటే...మరో వైపు.. ఏకంగా డిప్యూటీ సీఎం పదవినే ఎరగా కొంద‌రు నేత‌లు వేస్తుండ‌టం ఆశ్చ‌ర్యంగా ఉందంటున్నారు.

తాము ఎన్నిక‌ల్లో నెగ్గిన త‌ర్వాత తీసుకునే ఈ నిర్ణ‌యం పూర్తిగా ఢిల్లీ పెద్ద‌ల చేతుల్లో ఉంటుంద‌ని చెప్తున్నారు. స్థూలంగా డిప్యూటీ ప‌దవిపై ఇప్పుడు ద‌క్కేది ప్ర‌తిపాద‌న మాత్ర‌మేన‌ని...హామీ కానేకాద‌ని కాంగ్రెస్ రాజ‌కీయాల‌ను గుర్తెరిగిన వారి మాట‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English