ఎమ్మెల్యేల ఆదాయంపై షాకింగ్ రిపోర్ట్‌

ఎమ్మెల్యేల ఆదాయంపై షాకింగ్ రిపోర్ట్‌

ప‌ద‌వుల్లో అత్యంత క్రేజ్ ఉండే ఎమ్మెల్యే గిరీ విష‌యంలో మ‌రిన్ని సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. వివిధ రాష్ర్టాలకు చెందిన శాసనసభ్యులు ఏటా సగటున రూ.24.59 లక్షల ఆదాయాన్ని సంపాదిస్తున్నట్టు ఓ అధ్యయన నివేదిక వెల్లడించింది.

అయితే కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యేలు ఏటా కోటి రూపాయలకు పైగా ఆర్జిస్తుండగా, ఛత్తీస్‌గఢ్ శాసనసభ్యుల ఆదాయం మాత్రం రూ.5.4 లక్షలు మాత్రమేనని పేర్కొంది. ఇక ఎమ్మెల్యేల మధ్య ఆదాయం పరంగా లింగ అసమానతలు కూడా భారీగా ఉన్నట్టు పేర్కొన్నాయి.

పురుష ఎమ్మెల్యేల ఆదాయం మహిళా ఎమ్మెల్యేల ఆదాయం కంటే దాదాపు రెట్టింపుగా ఉన్నదని తెలిపింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు ఈ వివరాలను వెల్లడించాయి.

దేశవ్యాప్తంగా 4,086 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలుండగా, 3,145మందికి చెందిన అఫిడవిట్‌లను పరిశీలించి ఈ వివరాలను వెల్లడించామని ఎలక్షన్ వాచ్ సంస్థ తెలిపింది. 941 మంది ఎమ్మెల్యేలు తమ ఆదాయాన్ని వెల్లడించలేదని పేర్కొంది.

తమను తాము నిరక్షరాస్యులుగా చెప్పుకున్న ఎమ్మెల్యేల ఆదాయం ఏటా సగటున రూ.9.31లక్షలు ఉన్నది. ఎమ్మెల్యేలందరిలో సగం మందికి పైగా తమ వృత్తిని వ్యాపారం లేదా వ్యవసాయం అని ప్రకటించారు. తాము అధ్యయనం చేసిన 3,145 మంది సిట్టింగ్ శాసనసభ్యుల వార్షిక సగటు ఆదాయం రూ.24.59 లక్షలుగా ఉన్నట్టు తెలిపింది.

అయితే వీరిలో దక్షిణాదికి చెందిన 711 మంది ఎమ్మెల్యేలు అత్యధికంగా ఏటా సగటున రూ.51.99 లక్షలను ఆర్జిస్తున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. తూర్పు రాష్ర్టాలకు చెందిన 614 మంది ఎమ్మెల్యేలు అత్యల్పంగా ఏటా సగటున రూ.8.53 లక్షలను సంపాదిస్తున్నట్టు తెలిపింది.

దక్షిణాదిలో కర్ణాటకకు చెందిన 203 మంది ఎమ్మెల్యేల ఆదాయం ఏడాదికి సగటున రూ.1.11 కోట్లు ఉన్నట్టు పేర్కొంది. ఆ తరువాతి స్థానంలో మహారాష్ట్ర శాసనసభ్యులు ఏటా సగటున రూ.43.4 లక్షలను ఆర్జిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 63 మంది ఎమ్మెల్యేల వివరాలను విశ్లేషించగా, వారి ఆదాయం ఏటా సగటున 5.4 లక్షలున్నట్టు వెల్లడైంది. శాసనసభ్యుల్లో మహిళలు 258 మంది మాత్రమే ఉన్నారు. వీరి వార్షిక సగటు ఆదాయం రూ.10.53 లక్షలని వెల్లడైంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English