13గంట‌ల్లో ఏపీలో ప‌డిన పిడుగులెన్నో తెలిస్తే షాకే!

13గంట‌ల్లో ఏపీలో ప‌డిన పిడుగులెన్నో తెలిస్తే షాకే!

ఈ లెక్కలు చూసినోళ్లు ఎవ‌రైనా స‌రే వ‌ణికిపోవాల్సిందే. ఆకాశంలో ద‌ట్ట‌మైన మేఘాలు క‌మ్ముకున్న వేళ‌.. ఉధృతంగా గాలి వీస్తున్న స‌మ‌యంలో క‌ళ్లు మిరుమిట్లు గొలిపే కాంతుల మ‌ధ్య పెద్ద శ‌బ్దంతో ప‌డే పిడుగులు వింటే వ‌ణ‌కాల్సిందే. ఇక‌.. ద‌గ్గ‌ర్లో ప‌డే పిడుగుల సౌండ్ కు అదిపోతుంటారు. అంత‌లా భ‌య‌పెట్టే  పిడుగులు ఏపీలోని  (కృష్ణా.. గుంటూరు జిల్లాల్ని మిన‌హాయించి) మొత్తం 11 జిల్లాల్లో 13.30 గంట‌ల వ్య‌వ‌ధిలో వేలాదిగా ప‌డ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. ఎందుకిలా జ‌రిగింది? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి.

13.30 గంట‌ల వ్య‌వ‌ధిలో ఏకంగా 36,749 పిడుగులు ప‌డిన‌ట్లుగా అధికారులు అంచ‌నా వేస్తున్నారు. మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచి రాత్రి 8.30 గంట‌ల వ్య‌వ‌ధిలో ఏపీ వ్యాప్తంగా ఇన్నేసి వేల పిడుగులు ఎందుకు ప‌డిన‌ట్లు? అన్న‌ది ఇప్పుడు క్వ‌శ్చ‌న్ మార్క్ గా మారాయి. మొత్తం 11 జిల్లాల్లోని 369 మండ‌లాల్లో పడిన పిడుగుల కార‌ణంగా ఏడుగురు బ‌ల‌య్యారు.
పిడుగులు ప‌డ‌టం అంటే ఒక పావు గంటా.. అర‌గంటా ఉంటుంది. అలా కాకుండా ఇన్నేసి గంట‌లు ఇంత సుదీర్ఘంగా ప‌డ‌టం ఎలా? అన్న‌ది ఇప్పుడు విస్మ‌యక‌రంగా మారింది. ఇటీవ‌ల కాలంలో ఇంత భారీగా పిడుగుల వ‌ర్షం ప‌డ‌టం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. ఒక్కో పిడుగు స‌గ‌టున 16 కిలోమీట‌ర్లు ప్ర‌యాణం చేస్తుంద‌ని.. వాతావ‌ర‌ణాన్ని బ‌ట్టి పిడుగు 360 డిగ్రీల్లో త‌న దిశ‌ను మార్చుకుంటుంద‌ని చెబుతున్నారు.
ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే ఈ ఏడాది మార్చి 16 నుంచి 15 రోజుల వ్య‌వ‌ధిలో మొత్తం 10,436 పిడుగులు ప‌డ‌గా.. దీనికి రెండున్న‌ర రెట్లు ఎక్కువ‌గా కేవ‌లం 13.30 గంట‌ల వ్య‌వ‌ధిలో 36,749 పిడుగులు ప‌డ‌టం ఎందుక‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఈ అంశంపై అధికారులు కార‌ణాలు అన్వేషిస్తున్నారు. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన లెక్క ఏమిటంటే.. గ‌త సంవ‌త్స‌రం ఏప్రిల్ నుంచి అక్టోబ‌రు వ‌ర‌కూ ఏపీ వ్యాప్తంగా మొత్తం 2.62 ల‌క్ష‌ల పిడుగులు ప‌డిన‌ట్లుగా చెబుతున్నారు.

విశాఖ‌లో అత్య‌ధికంగా 35,320.. నెల్లూరులో 33,131.. ప్ర‌కాశంలో 27,231.. తూర్పుగోదావ‌రిలో 25,153.. విజ‌య‌న‌గ‌రంలో 22,602 పిడుగులు ప‌డ్డాయి. చిత్తూరులోనూ 20వేల‌కు పైగా పిడుగులు ప‌డ‌టం గ‌మ‌నార్హం. అత్యంత త‌క్కువ‌గా పిడుగులు ప‌డింది శ్రీ‌కాకుళం జిల్లాగా గుర్తించారు. ఇన్నేసి వేల పిడుగులు ఏపీనే టార్గెట్ చేస్తున్న‌ట్లుగా ఎందుకు ప‌డుతున్నాయి?  అన్న‌ది ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు