ప్రేమలో ఉన్నాను.. దయచేసి మార్కులేయండి

ప్రేమలో ఉన్నాను.. దయచేసి మార్కులేయండి

తెలివిమీరుతున్న విద్యార్థుల‌కు ఇదో ఉదాహ‌ర‌ణ‌. స‌హ‌జంగా పరీక్షల్లో కొందరు విద్యార్థులు జవాబుపత్రాలతో పాటు కరెన్సీ నోట్లు పెట్టి మార్కులు వేయండని వేడుకుంటారు.. మరికొందరు ఏ కారణం చేత జవాబులు రాయలేదో పేర్కొంటారు. ఇలాంటి ఓ విద్యార్థే తాను పూజ అనే అమ్మాయితో నిండా ప్రేమలో మునిగి ఉన్నందున చదువలేదని జవాబుపత్రంలో రాశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థి రసాయనశాస్త్రం పరీక్ష జవాబుపత్రాల్లో ప్రేమలో పడ్డాను, చదువాలనిపించలేదు అని మొదటిపేజీలో రాశాడు.

ఇంత‌కీ ఆయ‌న `ఈ ప్రేమ ఎంతో విచిత్రమైంది. ఈ ప్రేమ ఏంటో మనల్ని ఓ పట్టాన బతుకనీయదు, చావనీయదు. ప్రేమ కారణంగా చదువులపై దృష్టి పెట్టలేకపోయాను. దయచేసి నాకు మార్కులేయండి` అని విన్నవించుకున్నాడు. మరో విద్యార్థి తనకు తల్లిలేదని, పరీక్షల్లో ఫెయిలైతే తండ్రి చంపేస్తాడని భయంతో కూడిన విజ్ఞాపనను జవాబుపత్రాల మీద రాశా డు. కరెన్సీ నోట్లు పిన్‌చేసి పంపుతున్న జవాబుపత్రాలు వస్తున్నాయి. మరో విద్యార్థి తనను పాస్ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు అని ముజఫర్‌నగర్ జిల్లా స్కూల్స్ ఇన్స్‌పెక్టర్ ముఖేశ్ కుమార్ చెప్పారు. ఆ విద్యార్థిపై విచార‌ణ చేప‌డుతున్న‌ట్లు వివ‌రించారు.