ఆమె దెబ్బ‌కు ఎంపీల‌కే చుక్క‌లు

ఆమె దెబ్బ‌కు ఎంపీల‌కే చుక్క‌లు

ఒక మ‌హిళ వ్య‌వ‌హారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎంపీల‌ను ల‌క్ష్యంగా చేసుకొని ఆమె చేసే య‌వ్వారాల‌కు ఎంపీల‌కు చెమ‌ట‌లు ప‌డుతున్నాయి. కాస్త ప‌రిచ‌యం చేసుకొని..ఆ వెంట‌నే వారితో స‌న్నిహితంగా ఉన్న‌ట్లుగా ఫోటోలు సృష్టించి.. వారి బ‌తుకుల్ని బ‌జార్లో పెడ‌తామ‌ని బ్లాక్ మొయిల్ చేస్తూ డ‌బ్బులు దండుకునే మాయ‌లేడీ ఉదంతం ఇది. సంచ‌ల‌నం సృష్టిస్తున్న ఈ వ్య‌వ‌హారం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

గుజ‌రాత్‌కు చెందిన 67 ఏళ్ల బీజేపీ ఎంపీ కేసీ ప‌టేల్ చేసిన ఫిర్యాదుతో క‌దిలిన పోలీసుల పుణ్య‌మా అని అస‌లు విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఎంపీగారు ఇచ్చిన వివ‌రాల‌తో తీగ లాగిన పోలీసుల‌కు.. అమ్మ‌డి డొంక మొత్తం క‌ద‌ల‌ట‌మే కాదు.. ఆమె భాగోతాలు చూసి పోలీసుల‌కు సైతం నోట మాట రాని ప‌రిస్థితి. ఎంపీల‌కే బురిడి కొట్టించే అల‌వాటున్న ఈ మాయ‌లేడి గ‌తంలో కొంద‌రు ఎంపీల విష‌యంలోనూ ఇదే తీరులో వ్య‌వ‌హ‌రించి.. వారి ద‌గ్గ‌ర డ‌బ్బులు దండుకుంద‌ని చెబుతున్నారు. స‌దరు మ‌హిళ ఆచూకీ తెలుసుకొని.. ఆమె ఇంటి మీద దాడి చేసిన‌ప్ప‌టికీ.. ఆమె మాత్రం దొర‌క‌లేదు.

ఎంపీల వ‌ద్ద‌కు వెళ్ల‌టం.. వివిధ ప‌నుల దృష్ట్యా వారితో ప‌రిచ‌యం పెంచుకోవ‌టం.. స‌న్నిహితంగా ఉండ‌టం.. అద‌ను చూసుకొని వారితో దిగిన ఫోటోల్ని కాస్త మార్చేయ‌టం.. మ‌త్తు పానీయాల్ని క‌లిపి ఇచ్చి అప‌స్మార‌క ప‌రిస్థితుల్లోకి ఎంపీలు వెళ్లిన త‌ర్వాత‌.. త‌న‌తో స‌న్నిహితంగా ఉన్న‌ట్లుగా ఫోటోలు రూపొందించి.. త‌ర్వాత కోట్లాది రూపాయిలు ఇవ్వాలంటూ బ్లాక్ మొయిల్ చేస్తున్న వైనాన్ని పోలీసులు గుర్తించారు.

గుజ‌రాత్ ఎంపీ కేసీ ప‌టేల్ ఉదంతంలోకే చూస్తే.. స‌ద‌రు మ‌హిళ త‌న‌ను డిన్న‌ర్‌కు పిలిచింద‌ని.. త‌ర్వాత మ‌త్తు మందు క‌లిపి కూల్ డ్రింక్ ఇవ్వ‌టంతో అప‌స్మార‌క ప‌రిస్థితుల్లోకి వెళ్లిపోయాన‌ని.. త‌ర్వాత ఫోటోలు చూపించి రూ.5కోట్లు ఇవ్వాల‌ని బెదిరిస్తోంద‌ని ఆయ‌న చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. స‌ద‌రు మ‌హిళ మాత్రం త‌న‌పై స‌ద‌రు ఎంపీ అత్యాచారానికి పాల్ప‌డ్డార‌ని.. తాను ఫిర్యాదు చేస్తే పోలీసులు ప‌ట్టించుకోవ‌టం లేద‌ని చెబుతోంది. ఒక‌వేళ‌.. ఎంపీ అత్యాచార‌మే చేస్తే.. ఫోటోల‌కు దొరికిపోయేలా అత్యాచారం చేస్తారా? అన్న‌దే అస‌లు ప్ర‌శ్న‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు