చరణ్‌ రీ-ఎంట్రీ.. విరాళం.. పవన్ అభినందనలు

చరణ్‌ రీ-ఎంట్రీ.. విరాళం.. పవన్ అభినందనలు

కరోనా బాధితుల సహాయార్థం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. బాబాయ్‌ని స్ఫూర్తిగా తీసుకున్న అబ్బాయి రామ్ చరణ్ కూడా కరోనా బాధితుల కోసం రూ.70 లక్షలను విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్, మొదటి ట్వీట్‌లోనే విరాళం ప్రకటించడం విశేషం.

‘పవన్ కల్యాణ్ గారి ట్వీట్ చూసి స్ఫూర్తి పొందాను. నేను కూడా కేంద్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రిలిఫ్ ఫండ్ కోసం 70 లక్షల రూపాయలు విరాళంగా ఇస్తున్నాను’ అంటూ ట్వీట్ చేసిన చరణ్... కరోనా నివారణ కోసం కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పనితీరును మెచ్చుకోవడం విశేషం. రామ్ చరణ్‌కు ట్విట్టర్‌లోకి వెల్‌కమ్ చెప్పాలంటూ మెగాస్టార్ ట్వీట్ కూడా చేశారు. చిరూ ఎంట్రీ ఇచ్చిన తర్వాతి రోజే చరణ్ కూడా ట్విట్టర్‌లోకి రావడం... బాబాయ్ పవన్ కల్యాణ్‌ను ఆదర్శంగా తీసుకుని విరాళం ప్రకటించడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే గతంలో ఆల్రెడీ ట్విట్టర్లో సంచలనం సృష్టించిన చరణ్‌ కు.. ఇది రీ-ఎంట్రీ అని చెప్పాల్సిందే.

ఇకపోతే కరోనా బాధితుల కోసం విరాళం ప్రకటించిన రామ్ చరణ్‌ను పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా అభినందించారు. అలాగే జనసేన పార్టీ కూడా పవన్ ను ఆదర్శంగా తీసుకున్న చరణ్‌ ను కొనియాడింది.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English