'ఛలో' కారును అమ్మడు.. కానీ వాడడు

'ఛలో' కారును అమ్మడు.. కానీ వాడడు

కెరీర్లో పెద్దగా ఎదుగుదల లేక ఇబ్బంది పడుతున్న నాగశౌర్యకు పెద్ద హిట్ ఇవ్వడమే కాక.. అతడి సొంత బేనర్‌కు అదిరే ఆరంభాన్నిచ్చిన ఘనుడు వెంకీ కుడుముల. అదే సమయంలో వెంకీకి దర్శకుడిగా తొలి అవకాశమిచ్చి అతడి కెరీర్‌ను నిలబెట్టిన ఘనత శౌర్యకు చెందుతుంది. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి. కానీ 'ఛలో' సినిమా తర్వాత ఎందుకోగానీ ఇద్దరికీ అభిప్రాయ భేదాలు తలెత్తాయి.

అసలు సినిమాలే మానేద్దామనుకున్న వెంకీకి పిలిచి తనే ఛాన్స్ ఇచ్చానని.. రైటింగ్‌లో కూడా సాయం చేశానని.. కానీ అతను సినిమా రిలీజయ్యాక తన కాల్స్ తీయడమే మానేశాడని.. తాను ఇచ్చిన కారును వాడకుండా వేరే వాళ్లకు అమ్మేశాడని కొంచెం తీవ్ర స్థాయి ఆరోపణలే చేశాడు నాగశౌర్య. దీనిపై వెంకీ ఏమని సమాధానం ఇస్తాడో చూద్దామని అందరూ ఆసక్తితో ఉన్నారు.

కానీ వెంకీ మాత్రం దీనిపై పెద్దగా మాట్లాడటానికి ఇష్టపడట్లేదు. 'భీష్మ' ప్రమోషన్లకు వెళ్లినపుడు తనను కచ్చితంగా శౌర్య కామెంట్లపై స్పందించమని అడుగుతారని ముందే ప్రిపేరై వచ్చినట్లుగా ఈ విషయాన్ని ఒకట్రెండు ముక్కల్లో తెగ్గొట్టేశాడు వెంకీ. తమ వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలని జనాలకు పెద్దగా ఆసక్తి ఉంటుందనుకోవడం లేదని అతనన్నాడు. ఇక కారు గురించి విలేకరులు గుచ్చి గుచ్చి అడిగితే.. శౌర్య ఇచ్చిన కారును తాను మరొకరికి అమ్మేశానన్నది అబద్ధమన్నాడు. ఆ కారును అమ్మలేదని.. అమ్మే ఉద్దేశం కూడా లేదని.. తన తొలి సినిమా విజయానికి గుర్తుగా అందుకున్న కారును ఎందుకు అమ్ముతానని ప్రశ్నించాడు వెంకీ.

ఐతే వెంకీ ఈ కారును ఉపయోగించడం లేదని ఇండస్ట్రీ జనాలకు బాగా తెలుసు. దీన్ని బట్టి తెలుస్తున్నదేమంటే.. శౌర్య ఇచ్చిన కారును తన తొలి సినిమాకు గుర్తుగా అలాగే ఉంచుకుంటాడు. కానీ శౌర్య తనతో వ్యవహరించిన తీరుకు నిరసనగా ఆ కారును అతను వాడడు. అదీ సంగతి.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English