ఒక్క లుక్‌తో నెగెటివిటీ అంతా మటాష్

ఒక్క లుక్‌తో నెగెటివిటీ అంతా మటాష్

ఈ మధ్య రీమేక్ మూవీ అంటేనే ఒక రకమైన నెగెటివిటీ కనిపిస్తోంది జనాల్లో. ఇంటర్నెట్ విప్లవం వల్ల వేరే భాషల సినిమాలనూ జనాలు విచ్చలవిడిగా చూసేస్తున్నారు. వాటి విశేషాలూ బయటికి వచ్చేస్తున్నాయి. అంతగా పాపులర్ కాని సినిమాలు రీమేక్ చేసినా.. ఈ విషయం బయటకు పొక్కగా ఏముందా సినిమాలో అని ఇంటర్నెట్లో శోధించి.. సినిమాను డౌన్‌లోడ్ చేసి చూసుకుని విశేషాలన్నీ బయట పెట్టేస్తున్నారు.

ఇలాంటి టైంలో ‘అసురన్’ అనే సూపర్ పాపులర్ మూవీని వెంకటేష్ రీమేక్ చేయబోతున్నాడన్న సమాచారం బయటికి రాగానే తెలుగు ప్రేక్షకులంతా ఆ సినిమా మీద పడిపోయారు. అమేజాన్‌లో ఎగబడి చూసేశారు. చూశాక ఊరుకున్నారా..? ఈ సినిమా వెంకీకి సెట్ కాదు.. మన ప్రేక్షకుల అభిరుచికి సరిపోదు.. దీన్ని రీమేక్ చేయకపోవడం మంచిదంటూ తీర్మానాలు చేయడం మొదలుపెట్టారు.

రాను రాను ఈ అభిప్రాయాలు బలపడ్డాయి. దీనికి తోడు ఫ్యామిలీ సినిమాలు తీసే శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి దర్శకుడనగానే నెగెటివిటీ మరింత పెరిగింది. దీంతో ‘అసురన్’ రీమేక్ అసలు వర్కవుటవుతుందా అన్న సందేహాలు కలిగాయి. కానీ ఈ చిత్రానికి ‘నారప్ప’ అనే టైటిల్ ఖరారు చేస్తూ మంగళవారం వదిలిన ఫస్ట్ లుక్స్ చూశాక ఈ నెగెటివిటీ, సందేహాలు అన్నీ ఎగిరిపోయాయి.

ధనుష్‌‌ను అద్భుతంగా అభినయించిన పాత్రలో వెంకీ ఏమాత్రం ఫిట్ అవుతాడో అనుకుంటే.. ఆయన లుక్ చూశాక ధనుష్‌ను మించిపోయాడని అనిపిస్తోంది జనాలకు. గెటప్ భలేగా కుదిరి.. ధనుష్ కన్నా వెంకీ ఈ పాత్రలో బాగుంటాడనే భావన కలిగింది. లుక్ పర్ఫెక్ట్‌గా ఉండటం, సినిమాలోని ఇంటెన్సిటీ ఏమాత్రం తగ్గని రీతిలో ఫొటో షూట్ చేయడంతో ‘నారప్ప’ ఫస్ట్ లుక్స్‌ ఇన్‌స్టంట్‌గా హిట్టయిపోయాయి. ఇప్పటిదాకా ఉన్న నెగెటివిటీ అయితే పక్కకు పోయినట్లే. సినిమా కూడా బాగా తీస్తే తెలుగులోనూ మంచి విజయం సాధించే అవకాశముంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English