మహేష్‌... ఎన్నాళ్ళీ అత్తెసరు సినిమాలు?

మహేష్‌... ఎన్నాళ్ళీ అత్తెసరు సినిమాలు?

ప్రతి సినిమాకీ భారీ పారితోషికం వసూలు చేస్తోన్న మహేష్‌ కథల ఎంపిక పరంగా మరీ జాగ్రత్త వహిస్తున్నాడా? బ్రహ్మూెత్సవం, స్పైడర్‌ చిత్రాలతో తగిలిన దెబ్బలతో మహేష్‌ తన పాత్రల పరంగా కూడా వెరైటీ చూపించడం లేదు. కొరటాల శివ మినహా తనతో చేస్తోన్న దర్శకులంతా ఫార్ములాతో సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నారు. దీంతో విషయం తక్కువయిన ఈ అత్తెసరు సినిమాలు బ్రేక్‌ ఈవెన్‌ అవుతున్నాయే కానీ మహేష్‌ రేంజ్‌కి తగ్గట్టుగా పర్‌ఫార్మ్‌ చేయడం లేదు.

నిజానికి మహేష్‌బాబు సినిమా హిట్టయితే పక్కన సినిమాలకి స్పేస్‌ వుండదు. అంతటి భారీ బ్లాక్‌బస్టర్లు కొట్టే అలవాటున్న మహేష్‌ ఇటీవల కొత్తదనం వున్న కథలు ఎంచుకోవడం లేదు. దీంతో అతని సినిమానే మరో సినిమా వెనుక వుండాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు. మహర్షి, సరిలేరు నీకెవ్వరు లాంటి చిత్రాల వల్ల మహేష్‌ స్టార్‌డమ్‌కి వచ్చే బూస్ట్‌ ఏమీ వుండదు. తన మార్కెట్‌ అలా స్టాండర్డ్‌గా వుంటుందే తప్ప విస్తరించే వీలుండదు.

స్పైడర్‌తో పాన్‌ సౌత్‌ ఇండియా సినిమా చేయాలనే ప్రయత్నం బెడిసి కొట్టడంతో మహేష్‌ మరీ డిఫెన్స్‌లో పడిపోయినట్టున్నాడు. సుకుమార్‌తో చిత్రాన్ని కాన్సిల్‌ చేసుకుని మరీ 'సరిలేరు నీకెవ్వరు' లాంటి సాదాసీదా కథని ఎంచుకున్నాడు. మాస్‌ సినిమాల్లో కూడా కొత్త ఒరవడి చూపించిన మహేష్‌ మరోసారి ఒక్కడు, పోకిరి లాంటి కథల కోసం అన్వేషణ మొదలుపెట్టాలి. ఇప్పటికే ప్రభాస్‌, చరణ్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌ కూడా తనకంటే పెద్ద హిట్లు కొట్టేసి తమ సత్తా చాటుకున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English