అక్కడ విజయ్‌ దేవరకొండదే రాజ్యం

అక్కడ విజయ్‌ దేవరకొండదే రాజ్యం

బాలీవుడ్‌ హీరోయిన్లు ఆలియా భట్‌, జాన్వీ కపూర్‌ లాంటి వారు దక్షిణాది హీరోల్లో తమకి విజయ్‌ దేవరకొండ అంటే ఇష్టమంటే ఎవరు మాత్రం అతని పేరు సెర్చ్‌ చేయరు. అర్జున్‌ రెడ్డి సినిమా అటు హిందీలోకి, ఇటు తమిళంలోకి రీమేక్‌ అయితే ఒరిజినల్‌ హీరో గురించి ఎందుకు వాకబు చేయరు? హిందీలో అద్భుతమైన విజయం సాధించిన కబీర్‌ సింగ్‌ వల్ల విజయ్‌ దేవరకొండ దేశ వ్యాప్తంగా ట్రెండ్‌ అయ్యాడు.

ఇక తన కాంట్రవర్సీలు, తాను మాట్లాడే మాటలు, తనకున్న పరిచయాలు అతడిని ఎప్పుడూ వార్తల్లోనే వుంచుతాయి. అందుకే గూగుల్‌లో సౌత్‌ ఇండియా నుంచి మోస్ట్‌ సెర్చ్‌డ్‌ యాక్టర్‌గా విజయ్‌ నిలిచాడు.

ఒకవైపై మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచ్‌లర్‌ అనిపించుకుంటూనే, స్టయిల్‌లో తెలుగు హీరోలు ఎవరికీ లేని కొత్త ట్రెండు సృష్టిస్తోన్న విజయ్‌ దేవరకొండ ఇప్పుడు గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లోను ఒక సెన్సేషన్‌గా నిలిచాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English