హీరోని కాదంటోన్న నాగచైతన్య!

హీరోని కాదంటోన్న నాగచైతన్య!

'వెంకీ మామ' టైటిల్‌లో నాగచైతన్య ప్రస్తావన లేదు. ట్రెయిలర్‌ చూసినా కానీ వెంకటేష్‌ హైలైట్‌ అవుతూ, చైతన్య సైడ్‌కి కనిపిస్తున్నాడు. మల్టీస్టారర్‌ అయిన ఈ చిత్రంలో వెంకటేష్‌ కొద్దిగా ఎక్కువ సమానం ఎందుకయ్యాడనేది అక్కినేని అభిమానులకి అర్థం కావట్లేదు. అయితే దానిపై నాగచైతన్య క్లారిటీ ఇచ్చేసాడు.

ఈ చిత్రాన్ని మల్టీస్టారర్‌ అనడం సబబు కాదని చైతన్య చెప్పాడు. ఈ చిత్రంలో తాను ఒక పాత్ర చేసానని, హీరో 'వెంకీ మామ' అని చైతన్య అంటున్నాడు. గతంలో 'మనం' చిత్రంలోను నాగచైతన్య తన తండ్రికి సపోర్టింగ్‌ రోల్‌ మాత్రమే చేసాడు. తాను కూడా సక్సెస్‌ఫుల్‌ హీరో కనుక తనకి పెద్ద పాత్ర వుండాలని నాగచైతన్య ఎప్పుడూ డిమాండ్‌ చేయడు.

నిజానికి వెంకీ మామ కథ అనుకున్నపుడు నాగచైతన్య పాత్ర ఇంకా చిన్నదట. కానీ చైతన్య ఈ చిత్రం చేయడానికి అంగీకరించగానే వెంకటేష్‌ స్వయంగా బాబీకి చెప్పి చైతన్య పాత్రని పెంచమని అన్నాడట. అలా నాగచైతన్య పాత్రని సైనికుడిగా చూపించి, సర్జికల్‌ స్ట్రయిక్‌లో పాల్గొనడం లాంటి సన్నివేశాలని బాబీ జోడించాడట. అయినప్పటికీ ఇందులో తాను హీరోని మాత్రం కాదనే చైతన్య అంటున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English