టాప్‌ హీరోకి ఎంతటి దుస్థితి!

టాప్‌ హీరోకి ఎంతటి దుస్థితి!

సూర్య సినిమాలు ఫ్లాపవడం కొత్త కాదు కానీ 'బందోబస్త్‌' చిత్రానికి వచ్చిన మొదటి రోజు షేర్లు చూస్తేనే ఎవరైనా అవాక్కవుతారు. ఒక టైమ్‌లో అతని సినిమాలని ఇక్కడ ఇరవై కోట్లకి కొనేవారు. ఇప్పుడు అది ఎనిమిది కోట్లకి పడిపోయింది. అయితే ఈ డబ్బులు రావడం కూడా కష్టమని తెలియజేస్తూ బందోబస్త్‌ దారుణమైన వసూళ్లతో బాక్సాఫీస్‌ వద్ద జర్నీ స్టార్ట్‌ చేసింది.

సూర్యకి తోడు మోహన్‌లాల్‌, ఆర్య లాంటి వాళ్ల ప్యాడింగ్‌ వున్నా కానీ బందోబస్త్‌ జనాల దృష్టిని ఆకర్షించడం లేదు. మొదటి రోజు డెబ్బయ్‌ అయిదు లక్షల షేర్‌ రాబట్టుకున్న ఈ చిత్రం రెండవ రోజు మరింత దీనమైన వసూళ్లతో మొదలు పెట్టింది. దిల్‌ రాజు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేసినా కానీ ఫలితం లభించడం లేదు.

రెండవ రోజుకే సైడ్‌ థియేటర్లు తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. సూర్య చిత్రాల కోసం ఎగబడిన తెలుగు జనం ఇప్పుడతడిని పూర్తిగా విస్మరిస్తున్నారు. అతని చిత్రాలకి టీవీలో వేసినా టీఆర్పీలు రావడం లేదు. స్ట్రీమింగ్‌ సైట్స్‌లో కూడా సూర్య అనువాద చిత్రాలకి వ్యూస్‌ వుండడం లేదు. బందోబస్త్‌ తర్వాత ఇక సూర్య చిత్రాలకి తెలుగులో ప్యారలల్‌ రిలీజ్‌ కూడా దొరక్కపోవచ్చు. తెలుగులో స్ట్రెయిట్‌ సినిమా చేయాలని అనుకున్న సూర్య ఇప్పుడు తన చిత్రాలు డబ్‌ కూడా అవని పరిస్థితి తెచ్చుకున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English