రాజ్ తరుణ్‌ను తాగి ఉన్నావా అని అడిగితే..

రాజ్ తరుణ్‌ను తాగి ఉన్నావా అని అడిగితే..

యువ కథానాయకుడు రాజ్ తరుణ్ సినిమాల గురించి ఈ మధ్య ఏ చర్చా లేదు. వరుస ఫ్లాపులతో అల్లాడిపోయిన రాజ్.. కొన్ని నెలల కిందటే దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా మొదలుపెట్టాడు. ఆ తర్వాత దాని గురించి ఏ అప్ డేట్ లేదు. కానీ ఈ లోపు ఒక రాంగ్ న్యూస్‌తో వార్తల్లో వ్యక్తి అయిపోయాడు రాజ్. తన కారుతో యాక్సిడెంట్ చేసి (ఎవరికీ ఏమీ కాలేదు).. నడి రోడ్డు మీద కారు విడిచిపెట్టేసి రాజ్ పరుగులు తీయడం, దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవడం హాట్ టాపిక్ అయింది.

కారు నడుపుతున్నపుడు రాజ్ తాగి ఉన్నాడని.. ఎవరినో ఢీకొట్టాడని.. అందుకే భయపడి పారిపోయాడని రకరకాల ప్రచారాలు జరిగాయి. ఐతే రెండు రోజుల విరామం తర్వాత రాజ్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. భయంతో ఇంటికి పరుగెత్తా తప్పితే ఇంకేమీ లేదన్నాడు. ఈ మేరకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు.

ఆ స్టేట్మెంట్‌తో ఆగిపోకుండా ట్విట్టర్లో అభిమానులతో చిట్ చాట్ ద్వారా మరింత స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశాడు రాజ్. ఈ సందర్భంగా అతడికి ఎక్కువగా ఒకే ప్రశ్న ఎదురైంది. యాక్సిడెంట్ అయినపుడు తాగి ఉన్నారా అని. ఛాన్సే లేదంటూ ఖరాఖండిగా చెప్పాడు రాజ్. ఒక నెటిజన్ రెట్టించి అడిగాడు. ‘తాగి ఉన్నా కూడా తాగాం అని చెబుతారా’ అని కూడా అన్నాడు. దానికి రాజ్ బదులిస్తూ.. ‘‘యాక్సిడెంట్ అయిన బాధలో ఉంటే గోరుచుట్టుపై రోకటి పోటులా ఇదేంటి’’ అని ప్రశ్నించాడు.

తప్పు చేయనపుడు ఎందుకు పారిపోయావ్ అంటే.. ‘భయం వేసింది, సాయం కోసం ఇంటికెళ్లాలనిపించింది పరుగెత్తా’ అని చెప్పాడు రాజ్. మరి మీడియా ముందుకు వచ్చి వివరాలు చెప్పొచ్చుగా అంటే.. తప్పకుండా వస్తానని అన్నాడు రాజ్. ఇప్పటికే ట్విట్టర్లో జరిగిన విషయం ప్రస్తావించానని.. మరింత వివరణ ఇవ్వడం కోసం చిట్ చాట్ చేస్తున్నానని అన్నాడతను.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English