బెల్లంకొండ సురేష్.. ఒక నిజం.. ఒక అబద్ధం

బెల్లంకొండ సురేష్.. ఒక నిజం.. ఒక అబద్ధం

బెల్లంకొండ సురేష్ ఇప్పుడు పుత్రోత్సహంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఆయన తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్లో తొలిసారి నిఖార్సయిన హిట్టు కొట్టాడు. ‘రాక్షసుడు’ బాక్సాఫీస్ దగ్గర ఒడుదొడుకులు ఎదుర్కొంటూనే బ్రేక్ ఈవెన్ దిశగా అడుగులు వేస్తోంది. దాదాపుగా బయ్యర్లందరూ సేఫ్ జోన్లోకి వచ్చేసినట్లే.

విడుదలైన పదో రోజుకే బయ్యర్లందరూ లాభాల్లోకి రావడం చాలా ఆనందం కలిగించిందని.. తన కొడుక్కి ఇది మరపురాని సినిమా అని అంటున్నాడు సురేష్. ఇక శ్రీనివాస్ గత సినిమాల గురించి చెబుతూ.. ఒక నిజం, ఒక అబద్ధం చెప్పాడు సురేష్.

బెల్లంకొండ సురేష్ గత సినిమాల్లో కొన్ని చాలా బాగా ఆడాయని.. కాకపోతే వాటి బడ్జెట్లు ఎక్కువైపోవడం వల్ల అవి కాస్ట్ ఫెయిల్యూర్లుగా మిగిలిపోయాయని అన్నాడు సురేష్. ఇది నూటికి నూరు శాతం నిజం. ‘అల్లుడు శీను’, ‘జయ జానకి నాయకా’ ఉన్నంతలో బాగానే ఆడాయి. ఆ రెంటికీ హిట్ టాక్ వచ్చింది. బడ్జెట్ మరీ ఎక్కువ పెట్టేయడం వల్ల అవి బాక్సాఫీస్ దగ్గర ‘ఫ్లాపులు’గానే నిలిచాయి. కాకపోతే ఇక్కడ సురేష్ ఒక అతిశయోక్తి మాట చెప్పాడు. శ్రీనివాస్ సినిమాలు కొన్ని రూ.40 కోట్ల దాకా వసూళ్లు రాబట్టాయన్నాడు. ఇదే విడ్డూరం.

శ్రీనివాస్ సినిమాల్లో ఓ మాదిరిగా ఆడింది ‘అల్లుడు శీను’, ‘జయ జానకి నాయక’లే. అవి అటు ఇటుగా రూ.20 కోట్ల మేర వసూళ్లు సాధించాయి. మరీ డబుల్ చేసి చెప్పుకోవడం అతిశయోక్తి కాక మరేమిటి. ఇదిలా ఉంటే.. తన కొడుక్కి త్వరలోనే పెళ్లి చేయబోతున్నానని.. కొన్ని రోజుల్లోనే శుభవార్త చెబుతానని.. సినీ పరిశ్రమకు చెందిన అమ్మాయిని కాకుండా బయటి అమ్మాయిని చూస్తున్నామని చెప్పాడు సురేష్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English