ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్టు

ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్టు

ఆ మధ్య ‘ఆర్ఆర్ఆర్’ ప్రెస్ మీట్ పెట్టి దానికి తన హీరోలిద్దరినీ కూడా తీసుకొచ్చాాడు రాజమౌళి. అప్పుడు ఇద్దరు హీరోల్ని చూసిన ఎవ్వఱైనా ఎవరి లుక్ బాగుందో ఇట్టే చెప్పేస్తారు. రామ్ చరణ్ మంచి ఫిజిక్‌తో, లుక్‌తో ఆ ప్రెస్ మీట్‌కు హాజరయ్యాడు.

షేవ్ చేసుకుని కోర మీసంతో భలేగా కనిపించాడు చరణ్. సినిమా కోసం అతడి మేకోవర్ అందులో స్పష్టంగా కనిపించింది. కానీ అదే ప్రెస్ మీట్లో ఎన్టీఆర్ చాలా మామూలుగా కనిపించాడు.

లుక్‌లో పెద్దగా మార్పు లేదు. ఫిజిక్ మామూలుగా ఉంది. హేర్ స్టైల్, గడ్డం, మీసం ఏదీ కూడా స్టైలింగ్ చేయించినట్లు లేదు. దీంతో ఆ రోజు రామ్ చరణ్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాని మీద పెద్ద డిస్కషన్ నడిచింది. ఎన్టీఆర్‌లో అప్పటికి ఏ మార్పు ఎందుకు లేదో తెలియదు మరి.

ఐతే తర్వాతి రోజుల్లో తారక్ లుక్ మారుతుందని.. షూటింగ్ సందర్సంగా ఏదో ఒక లుక్ బయటికి వస్తుందని తారక్ ఫ్యాన్స్ ఎదురు చూశారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి రామ్ చరణ్ హాట్ టాపిక్ అయ్యాడు. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌లో పాల్గొంటున్న అతను మధ్యలో ఎక్కడో ఎయిర్ పోర్ట్ దగ్గర మీడియాకు చిక్కాడు. లుక్ బయటికి వచ్చింది.

ఇంతకుముందు చూసిందానికంటే బెటర్ లుక్‌లో కనిపిపిస్తున్నాడు చరణ్ ఇందులో. ఒక రకంగా చెప్పాలంటే అతడికిది కెరీర్ బెస్ట్ లుక్ అనొచ్చు. టోటల్ మేకోవర్‌తో చాలా హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నాడు. ఈ లుక్ చూసి మెగా అభిమానులు ఊగిపోతున్నారు.

కానీ తారక్ లుక్‌లో మేకోవర్ వచ్చిందో లేదో తెలియక.. ‘ఆర్ఆర్ఆర్’లోని అతడి లుక్ గురించి ఏ స్పష్టత లేక అతడి అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’లో చరణ్ లుక్ గురించి ఇంత డిస్కషన్ నడుస్తుంటే.. తమ హీరో గురించి మాత్రం చర్చ లేకపోవడం వాళ్లకు రుచించడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English