చిరంజీవికి డెడ్‌లైన్‌ పెట్టేసాడు!

చిరంజీవికి డెడ్‌లైన్‌ పెట్టేసాడు!

మెగాస్టార్‌ చిరంజీవి కాబట్టి ఆయన డేట్స్‌ ఇస్తే డైరెక్టర్లు సరిపెట్టుకోవాలి. ఆయన ఎలా వుంటే అలా ఓకే అనుకుని సినిమా తీసేయాలి. కానీ కొరటాల శివ మాత్రం అదంతా జాన్తానై అనేసాడు. చిరంజీవితో తాను తీయబోయే చిత్రంలో కమర్షియల్‌ అంశాలు కూడా వుంటాయి కనుక మెగాస్టార్‌ ఇప్పుడున్న రూపంతో వుంటే కుదరదని చెప్పేసాడు. ఆయన బరువు తగ్గాలని చెప్పి అందుకు కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఇచ్చాడు. ఖైదీ నంబర్‌ 150 టైమ్‌లో బరువు తగ్గిన చిరంజీవి తర్వాత భుజానికి శస్త్ర చికిత్స జరిగాక ఫిట్‌నెస్‌ని అంతగా పట్టించుకోలేదు.

సైరా చిత్రంలో కూడా కాస్త లావుగానే కనిపిస్తున్నారు. అయితే ఆ రూపంతో కమర్షియల్‌ సినిమా చేస్తే జనం ఆదరించరని కొరటాల భావిస్తున్నాడు. అందుకే చిరంజీవిని బరువు తగ్గాల్సిందిగా కోరాడు. కొరటాల కోసమని చిరంజీవి ఆల్రెడీ డైట్‌ స్టార్ట్‌ చేసి, జిమ్‌కి కూడా వెళుతున్నారు. మరి ఈ చిత్రంలో కొరటాల ఆయనతో ఫైట్లే చేయిస్తాడో లేక ఖైదీ నంబర్‌ 150లా డాన్సులు కూడా చేయాలని కోరతాడో తెలియదు. మొత్తానికి అరవై నాలుగేళ్ల వయసులో చిరంజీవికి బరువులు ఎత్తడాలు, బరువు తగ్గడాలు అయితే తప్పడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English