ఆమె పోలీసట.. మరి ప్రభాస్?

 ఆమె పోలీసట.. మరి ప్రభాస్?

ఇప్పుడు దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘సాహో’. ముందు నుంచే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉండగా.. ఇటీవలే రిలీజైన టీజర్‌తో అవి మరింత పెరిగిపోయాయి. సినిమాకు సంబంధించిన విశేషాల పట్ల అన్ని భాషల ప్రేక్షకులూ అమితాసక్తితో ఉన్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఏంటనే విషయంలో చాలా ఉత్కంఠతో కనిపిస్తున్నారు.

టీజర్ చూస్తే ప్రభాస్ సహా ఏ క్యారెక్టర్ మీదా ఒక అంచనాకు వచ్చే పరిస్థితి కనిపించలేదు. ఐతే తన పాత్ర గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో శ్రద్ధా కపూర్ గుట్టు విప్పేసింది. తాను ‘సాహో’లో చేస్తున్నది పోలీస్ పాత్ర అని ఆమె వెల్లడించింది.

‘‘తొలిసారి నేను పోలీసు పాత్రలో నటిస్తున్నందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. దేశం కోసం భద్రతా బలగాలు ఎన్నో త్యాగాలు చేస్తాయి. అలాంటిది నేను వారి పాత్రలో నటిస్తున్నందుకు అదృష్టంగా భావిస్తున్నాను. నాకు వైద్యురాలిగా, పోలీసుగా విభిన్న పాత్రల్లో నటించాలన్న ఆసక్తి ఉంది. కానీ ఎన్ని పాత్రల్లో నటించినా పోలీసు పాత్ర చాలా స్పెషల్‌. షూటింగ్‌ చేస్తున్నంతసేపు నేను గన్ను పట్టుకునే ఉన్నాను. ఒక్కమాటలో చెప్పాలంటే గన్ను నా శరీరంలో అవయవంలా మారిపోయింది’’ అని శ్రద్ధ చెప్పింది.

కథానాయికది పోలీస్ పాత్ర అయితే.. మరి ప్రభాస్ పాత్ర ఏమై ఉంటుందన్నది ఆసక్తికరం. ప్రభాస్ స్పైగా ఉన్న పోలీస్ అయి ఉంటాడా.. లేక అతను చిక్కడు దొరకడు లాంటి దొంగ పాత్ర చేస్తున్నాడా అని రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. అతడిది మోసగాళ్లకు మోసగాడి తరహా పాత్ర అయి ఉండొచ్చని ముందు నుంచి ఊహాగానాలున్నాయి. ట్రైలర్ రిలీజైతే కొంత మేర స్పష్టత వస్తుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English