అతడిని ఫ్లాప్‌లు వెంటాడుతున్నాయ్‌!

అతడిని ఫ్లాప్‌లు వెంటాడుతున్నాయ్‌!

'సీత' బుకింగ్స్‌ విడుదలకి దగ్గర పడే కొద్దీ పుంజుకుంటాయని అనుకున్నారు కానీ ఆ ఛాయలేమీ కనిపించడం లేదు. ఈ చిత్రంపై జనంలో కనీస ఆసక్తి లేదనేది బుకింగ్స్‌తో పాటు బుక్‌ మై షో.కామ్‌లో ఈ చిత్రం పట్ల ఆసక్తిగా వున్న వారి సంఖ్య చూస్తేనే తెలుస్తోంది. మరి ఈ చిత్రం ట్రెయిలర్లకి అన్నేసి వ్యూస్‌ ఎందుకొచ్చాయనేది తెలియదు.

మొత్తానికి బెల్లంకొండ శ్రీనివాస్‌ చేసిన వరుస ఫ్లాప్‌ సినిమాలు సీత మెడకి చుట్టుకున్నాయ్‌. ఈ చిత్రానికి వచ్చే టాక్‌ని బట్టి వసూళ్లు పుంజుకుంటాయని, మొదటి రోజు ఉదయం ఆటలు మాత్రం శ్రీనివాస్‌ గత చిత్రాల మాదిరిగా వుండవని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయ్‌. నేనే రాజు నేనే మంత్రి చిత్రానికి ట్రెయిలర్లతోనే జనం దృష్టిని ఆకర్షించిన తేజ ఈసారి అలాంటి మాయాజాలం చూపించలేకపోయాడు. ఈ చిత్రాన్ని నిషేధించాలని రేగిన వివాదం కూడా జనం దృష్టిలో పడకుండానే చల్లారిపోయింది.
ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జనం దృష్టి సినిమాలపై లేని దశలో రావడం కూడా దీనికి వస్తోన్న స్పందనని ప్రభావితం చేస్తోంది. సినిమా బాగుందనే టాక్‌ వస్తే కనుక వారాంతానికి వసూళ్లు పుంజుకునే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English