'మనం' సినిమాగా మార్చేస్తున్నారు

'మనం' సినిమాగా మార్చేస్తున్నారు

మనం సినిమా టాలీవుడ్ లో అభిమానులకు ఓ కొత్త అనుభూతిని ఇవ్వడమే కాకుండా అక్కినేని వారికి కూడా ఓ స్వీట్ మెమోరిని ఇచ్చింది. ఆ సినిమా అనంతరం మిగతా సినీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సింగిల్ ఫ్రెమ్ లో కనిపించాలని అనుకున్నారు. కానీ ఎవ్వరికీ సరైన కథ దొరకడం లేదు. ఇక ఇప్పుడు మరీ ఆ రేంజ్ లో కాకపోయినా దగ్గుబాటి ఫ్యామిలీకి కూడా తీయని జ్ఞాపకంగా వెంకీ మామ నిలవబోతున్నట్లు చెప్పవచ్చు.

ఎందుకంటే ఇది ఇప్పుడు దగ్గుబాటి వారి వంశం కలిసి చేస్తున్న సినిమా. వెంకటేష్ - నాగ చైతన్య మామ అల్లుళ్లు గా తెరపై కూడా జీవించడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వీరితో మరో దగ్గుబాటి హీరో రానా కూడా కలవనున్నాడు. అతిథి పాత్రలో కనిపించి సినిమాకు కొత్త లుక్ తెనున్నట్లు తెలుస్తోంది. సురేష్ ప్రొడక్షన్ లో సొంతంగా దగ్గుబాటి సురేష్ బాబు సినిమాను నిర్మిస్తుండడంతో ఈ సినిమా దగ్గుబాటి వారి నుంచి వస్తోన్న 'మనం' అని చెప్పొచ్చు.

నిర్మాత సురేష్ బాబు.. మామా అల్లుళ్లు వెంకటేష్ నాగ చైతన్య.. దగ్గుబాటి వారి అబ్బాయ్ రానా.. ఇలా ఒకే సినిమా కోసం చేతులు కలపడం బాగానే ఉంది కాని.. అది రొటీన్ కామెడీ కాకుండా ఏదన్నా మాంచి కాన్సెప్ట్ ఉంటే బాగుంటుంది. వెంకీ చైతు రానా ముగ్గురు సింగిల్ ఫ్రెమ్ లో కనిపిస్తే కిక్కే.. కాని అందులో ఏదన్నా కొత్తదనం ఉంటే మాత్రం విజిల్స్ తో థియేటర్ టాప్ లేచిపోతుంది. పనిలో పనిగా రానా తమ్ముడు అభిరామ్ కూడా ఓ ఎంట్రీ ఇస్తే ఇక 'వెంకీ మామ' పూర్తిగా మరో దగ్గుబాటి 'మనం' అవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English