తారక్, చరణ్.. గెట్ రెడీ అమ్మా

తారక్, చరణ్.. గెట్ రెడీ అమ్మా

టాలీవుడ్ అనే కాదు.. దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ‘బాహుబలి’ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి తీసే సినిమా మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే ప్రతిసారీ తనపై పెరిగే అంచనాల్ని అందుకుంటూ సాగిపోతున్న దర్శక ధీరుడు.. మరోసారి మ్యాజిక్ చేస్తాడనే ఆశిస్తున్నారు అభిమానులు. గత నవంబరులో సెట్స్ మీదికి వెళ్లిన ఈ చిత్రం ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. తన కొడుకు కార్తికేయ పెళ్లి ఉండటంతో రాజమౌళి పూర్తిగా సినిమా ఆలోచనలు పక్కన పెట్టేశాడు. నెల రోజులకు పైగా పెళ్లి పనుల్లోనే బిజీగా ఉన్నాడు. ఈ మధ్యే కొంచెం హడావుడి తగ్గింది. కొడుకు పెళ్లిలో జక్కన్న ఏ రేంజిలో ఎంజాయ్ చేశాడో అందరూ చూశారు.


ఐతే ఇప్పుడు రాజమౌళి వర్క్ మోడ్‌లోకి వచ్చేశాడు. ‘ఆర్ఆర్ఆర్’ రెండో షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నాడు. ఈ నెల 21 నుంచి తర్వాతి షెడ్యూల్ మొదలవుతుందట. అది ఎక్కడ ఏంటి అన్న వివరాలు బయటికి రాలేదు. కొత్త షెడ్యూల్‌కు ముహూర్తం మాత్రం కుదిరింది. చరణ్ ‘వినయ విధేయ రామ’ రిలీజ్, ప్రమోషన్ల సంగతి చూసుకుని ఫ్రీ అయిపోతున్నాడు. తారక్ పూర్తిగా కుటుంబంతో ఎంజాయ్ చేసి వస్తున్నాడు. ఇద్దరూ ఈ షెడ్యూల్ కోసం కొంచెం కసరత్తులు చేసి రావాల్సి ఉందట. ఈ ఇద్దరి పాత్రలు.. లుక్స్ విషయంలో రకరకాల రూమర్లు వచ్చాయి. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. తాను ఇందులో సాధారణమైన లుక్‌లోనే కనిపిస్తానని చరణ్ చెప్పాడు. తారక్ మాత్రం చాలా రఫ్‌గా కనిపిస్తాడన్నాడు. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఎన్టీఆర్ గడ్డంతో చాలా రఫ్‌గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి తారక్, చరణ్ మళ్లీ షూటింగ్ మోడ్‌లోకి వెళ్తుండటం అభిమానులకు ఆనందాన్నిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English