మమ్ముట్టికి తండ్రిగా ఎలాగబ్బా?

మమ్ముట్టికి తండ్రిగా ఎలాగబ్బా?

‘లెజెండ్’తో సెకండ్ ఇన్నింగ్స్ ఘనంగా ఆరంభించిన జగపతిబాబు.. ఆ తర్వాత విలక్షణమైన పాత్రలతో దూసుకెళ్లాడు. వివిధ భాషల్లో మరపురాని పాత్రలు చేశాడు. ఆయన ఇప్పుడు తన కెరీర్లో ఎన్నడూ చేయని ఒక భిన్నమైన పాత్ర చేస్తున్నాడు. ఒక నిజ జీవిత వ్యక్తి పాత్ర పోషిస్తున్నాడు. ఆ వ్యక్తే.. వైఎస్ రాజారెడ్డి. దివంగత ముఖ్యమత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి ఆయన. వైఎస్ జీవితంలో అతి ముఖ్యమైన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘యాత్ర’ సినిమాలో జగపతి రాజా రెడ్డి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ పాత్రకు సంబంధించిన లుక్ తాజాగా బయటికి వదిలారు. బారు మీసంతో జగపతి ఆ పాత్రకు బాగానే సూటయ్యాడు. ఆయన లుక్ చాలా బాగుంది. కాకపోతే ఇక్కడే ఒక సమస్య ఉంది. జగపతి సినిమాలో మమ్ముట్టికి తండ్రిగా కనిపించాలి.

మమ్ముట్టి జగపతి కన్నా పెద్ద వయస్కుడు. వైఎస్ పాత్రలో ఆయన లుక్ కూడా కొంచెం పెద్ద వయస్కుడి లాగే ఉంది. ఈ చిత్రంలో యువ వైఎస్‌ను చూపించే అవకాశాలు దాదాపు లేనట్లే. వైఎస్ తన తండ్రితో పాటు ఉన్న సీన్లు తీస్తే.. జగపతిని పెద్దవాడిగా.. మమ్ముట్టిని ఆయన తనయుడిగా చూపించడం అంత సులువు కాదు. జగపతి ఇంకా సూపర్ ఫిట్‌గా కనిపిస్తున్నాడు. అలాంటి వాడిని మమ్ముట్టికి తండ్రికి చూపించి ఒప్పించడం.. మెప్పించడం అంత సులువు కాదు. మరి ఈ సీన్లు ఎలా వచ్చాయో ఏంటో మరి. ఐతే సినిమాలో జగపతి పాత్ర పరిమితంగానే ఉంటుందని.. కొన్ని సీన్లతో ముగించేస్తారని అంటున్నారు. వైఎస్ రాజారెడ్డిని ప్రత్యర్థులు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఆయన సైతం అంతకుముందు అనేక అఘాయిత్యాలు చేశారన్న ఆరోపణలూ ఉన్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English