అక్కినేని వారి కోసం విజయేంద్ర స్కిప్ట్?

అక్కినేని వారి కోసం విజయేంద్ర స్కిప్ట్?

అక్కినేని వారికి గడ్డు కాలం నడుస్తోంది కొంత కాలంగా. కుటుంబంలో అందరినీ ఫ్లాపులు వెంటాడుతున్నాయి. నాగార్జున, నాగచైతన్య, అఖిల్.. ఇలా ముగ్గురూ ఫ్లాపుల్లోనే ఉన్నారిప్పుడు. వీరిలో నాగచైతన్య ఒక టైంలో మంచి ఫాంలోనే కనిపించాడు. 'ప్రేమమ్'.. 'రారండోయ్ వేడుక చూద్దాం' హిట్టయి అతడికి మంచి ఊపునిచ్చాయి.

కానీ ఆ తర్వాత వచ్చిన 'యుద్ధం శరణం'.. 'శైలజారెడ్డి అల్లుడు'.. 'సవ్యసాచి' నిరాశకు గురిచేశాయి. హ్యాట్రిక్ ఫ్లాపులతో రేసులో బాగా వెనుకబడిపోయాడు అక్కినేని హీరో. ముఖ్యంగా 'సవ్యసాచి' అతడికి మామూలు ఎదురు దెబ్బ కాదు. ఇప్పుడు అతడి ఆశలన్నీ తన భార్య సమంతతో కలిసి చేస్తున్న 'మజిలీ' మీదే ఉన్నాయి.

ఈ సినిమా ఏమవుతుందో ఏమో కానీ.. కొడుకును ఆదుకునేందుకు నాగ్ మరో ప్లాన్ వేశాడని సమాచారం. తనతో ఇంతకుముందు 'రాజన్న' తీసిన విజయేంద్ర ప్రసాద్‌ను చైతూ కోసం ఒక కథ రాయమని అడిగాడట నాగ్. ఆయన కోరినట్లే రాజమౌళి తండ్రి చైతూ కోసం ఒక స్క్రిప్టు రెడీ చేస్తున్నట్లు సమాచారం.

మంచి యాక్షన్ సినిమా చేసి పెద్ద హిట్టు కొట్టాలని చైతూ ఎప్పటి నుంచి కోరుకుంటున్నాడు. కానీ యాక్షన్ సినిమా చేసిన ప్రతిసారీ ఎదురు దెబ్బే తగులుతోంది. ఈ నేపథ్యంలో విజయేంద్ర తనదైన శైలిలో ఎమోషన్లు, యాక్షన్ కలగలిసిన కథను చైతూ కోసం రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఐతే ఈ చిత్రానికి దర్శకుడిగా ఎవరిని ఎంచుకుంటారన్నది ఆసక్తికరం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English