సవ్యసాచి బాధితులకి అమర్‌ అక్బర్‌ అండ!

సవ్యసాచి బాధితులకి అమర్‌ అక్బర్‌ అండ!

మైత్రి మూవీ మేకర్స్‌ వరుసగా మూడు బ్లాక్‌బస్టర్స్‌ ఇవ్వడంతో వారి నాలుగవ చిత్రంపై కూడా అంతే అంచనాలతో బయ్యర్లు కొనేసారు. నాగచైతన్య మార్కెట్‌కి అత్యధికంగా ఎంత చెల్లిస్తారో అంత చెల్లించారు. అతనికి యాక్షన్‌ సినిమాలతో కలిసి రాకపోయినా కానీ బయ్యర్లు మాత్రం మైత్రిని నమ్మారు. కానీ ఈసారి మైత్రి లెక్క తప్పడంతో సవ్యసాచి దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. బయ్యర్లకి సగానికంటే ఎక్కువే నష్టాలు రావడంతో వారిని ఆదుకోవడానికి మైత్రి మూవీస్‌ నిర్ణయించుకుంది. వారి సంస్థ నుంచి వస్తోన్న తదుపరి చిత్రం 'అమర్‌ అక్బర్‌ ఆంటొని'ని మార్కెట్‌ ధర కంటే తక్కువ రేట్లకి విక్రయిస్తున్నారు.

దీని వల్ల ఈ చిత్రంతో సవ్యసాచి లాస్‌లు కాస్తయినా రికవర్‌ కావచ్చునని బయ్యర్లు ఆనందిస్తున్నారు. నిర్మాతలుగా అమర్‌ అక్బర్‌ ఆంటొనితో కానీ, సవ్యసాచితో కానీ మైత్రి మూవీస్‌కి ఎలాంటి నష్టం లేదు. థియేట్రికల్‌ రైట్స్‌ కాకుండా మిగతా వాటితో కూడా వారికి బాగానే గిట్టుబాటు అయింది. అయితే పరాజయం ఇచ్చారనే అపప్రద లేకుండా ఇలా వెంటనే వారికి నష్ట పరిహారం చేసి తమ గుడ్‌విల్‌ నిలుపుకున్నారు. హారిక హాసిని సంస్థ కూడా అజ్ఞాతవాసి టైమ్‌లో బయ్యర్లని ఇలాగే ఆదుకుని అందరి మన్ననలు అందుకున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English