సల్మాన్ బామ్మర్ది నోట బన్నీ మాట

సల్మాన్ బామ్మర్ది నోట బన్నీ మాట

కేవలం తెలుగు వరకే కాదు.. మొత్తం ఇండియాలోనే బెస్ట్ డ్యాన్సర్స్ అనదగ్గ హీరోలు మన టాలీవుడ్లో ఉన్నారు. అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు.. అల్లు అర్జున్. అతడి డ్యాన్సులకు ఉత్తరాదిన కూడా భారీగా అభిమానులున్నారు. బాలీవుడ్ తారలు సైతం బన్నీ డ్యాన్సింగ్ స్కిల్స్ గురించి మాట్లాడుతుంటారు. తాజాగా సల్మాన్ ఖాన్ బావమరిది ఆయుష్ శర్మ సైతం తనకు డ్యాన్స్ విషయం బన్నీ స్ఫూర్తి అని చెప్పాడు. ‘లవ్ రాత్రి’ అనే సినిమాతో కథానాయకుడిగా పరిచయం కాబోతున్న ఆయుష్ తాజాగా హైదరాబాద్‌కు వచ్చాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బన్నీ ప్రస్తావన తెచ్చాడు.

అల్లు అర్జున్ తిరుగులేని డ్యాన్సర్ అని.. తాను ఏదో ఒక రోజు అతడిలా డ్యాన్స్ చేయాలని ఆశిస్తున్నానని.. ఐతే తాను బన్నీని 100 శాతం మ్యాచ్ చేయలేనని తెలుసని.. కానీ తన ప్రయత్నం తాను చేస్తానని ఆయుష్ అన్నాడు. సల్మాన్ సోదరి అర్పితను పెళ్లి చేసుకుని అతడి కుటుంబంలోకి వచ్చిన ఆయుష్.. తన బావ నిర్మాణంలోనే హీరోగా పరిచయం కానున్నాడు. అభిరాజ్ మినవాలా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలే రిలీజ్ చేసిన ట్రైలర్లో ఆయుష్ అదిరిపోయే స్టెప్పులతో ఆశ్చర్యపరిచాడు. సినిమాలో అతను ఇంకా మంచి స్టెప్స్ వేశాడని అంటున్నారు. వరినా హుస్సేన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకొస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు