సంజయ్ బయోపిక్.. సల్మాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్

 సంజయ్ బయోపిక్.. సల్మాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్

ఈ ఏడాది బాలీవుడ్లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ‘సంజు’ ఒకటని చెప్పాలి. నిన్నటి తరం బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దీని టీజర్.. ట్రైలర్లతో ప్రేక్షకుల్లో ఎంతో క్యూరియాసిటీ తీసుకొచ్చాడు దర్శకుడు రాజ్ కుమార్ హిరాని. జూన్ 29న ఈ చిత్రం రిలీజ్ కాబోతుండగా.. ఆ డేట్ దగ్గర పడే కొద్దీ ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరుగుతోంది.

ఈ మధ్య సౌత్ సినిమా ధాటికి తట్టుకోలేక బాక్సాఫీస్ రేసులో వెనుకబడిపోతున్న బాలీవుడ్.. ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకుంది. ఈ చిత్రానికి బాలీవుడ్ ప్రముఖులందరూ మంచి సపోర్టిస్తున్నారు. ఇప్పటికే అమీర్ ఖాన్ ఈ సినిమా గురించి చాలా పాజిటివ్‌గా మాట్లాడాడు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కూడా లైన్లోకి వచ్చాడు.

‘సంజు’ టీజర్.. ట్రైలర్ చాలా బాగున్నాయని.. రాజ్ కుమార్ హిరాని అద్భుతమైన దర్శకుడని.. చాలా హృద్యంగా సినిమాలు తీస్తాడని.. ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పాడు సల్మాన్. ఈ సందర్భంగా సల్మాన్ ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. ఈ సినిమాలో సంజయ్ దత్ పాత్రలో వేరొకరు కాకుండా ఆయన్నే చూడాలని తనకు అనిపిస్తోందన్నాడు. ముఖ్యంగా తన జీవితంలోని చివరి 7-8 ఏళ్లలో సంజునే కనిపించాలని కోరుకుంటున్నానని.. ఆయనే సినిమాలో నటించి ఉండాల్సిందని అన్నాడు సల్మాన్.

తనలాగే కేసుల్లో ఇరుక్కుని జైలుకు వెళ్లిరావడంతో సల్మాన్.. సంజయ్‌తో ఎమోషనల్‌గా కనెక్టయినట్లున్నాడు. సంజయ్ జీవితం వెండి తెరమీదికి వచ్చేసింది. ఇంతకీ మీ బయోపిక్ ఎప్పుడు అని సల్మాన్‌ను అడిగితే మాత్రం.. తనకు అలాంటి ఆలోచనేమీ లేదన్నాడు. తాను చాలా ఓపెన్‌గా ఉంటానని, ఏదీ దాచనని.. కానీ తన సినిమాను మాత్రం చూడాలనుకోవడం లేదని సల్మాన్ తేల్చి చెప్పేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English