ఎంతిస్తారు... ఎన్ని రోజులు... డీల్‌!

ఎంతిస్తారు... ఎన్ని రోజులు... డీల్‌!

రవితేజ వ్యవహారం ప్రస్తుతం ఇలాగే వుందని ఇండస్ట్రీ టాక్‌. ఏ సినిమాకి అయినా కానీ ఎంత పారితోషికం ఇస్తారు, ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అనేది మాట్లాడుకుని, నచ్చితే డీల్‌ అంటున్నాడట. కథ నచ్చినా, నచ్చకపోయినా రవితేజ పెద్దగా పట్టించుకోవడం లేదని, మిగతా విషయాలన్నీ క్లియర్‌గా వుంటే సినిమా ఫలితం ఏమవుతుందనేది కూడా అతడికి పట్టడం లేదని టాక్‌.

టచ్‌ చేసి చూడు చిత్రం అంతటి ఘోర పరాజయం పాలయితే చీమ కుట్టినట్టయినా ఫీలవని రవితేజ కేవలం మూడు నెలల వ్యవధిలో మరో సినిమా పూర్తి చేసి విడుదల చేసాడు. కేవలం మూడు నెలల పాటు నిర్మాణంలో వున్న నేల టికెట్‌ ఎలా తయారైందనేది తెలిసిందే. ఆదివారానికి ఏడున్నర కోట్ల షేర్‌ వసూలు చేసిన ఈ చిత్రం సోమవారం నుంచి ముసుగు తన్నేసింది. ఈ చిత్రంతో కూడా బయ్యర్లకి యాభై నుంచి అరవై శాతం నష్టాలు తప్పవని ట్రేడ్‌ చెబుతోంది. అయినా కానీ రవితేజ దాని గురించి ఆలోచించడం లేదు.

తనకి హిట్టు, ఫట్టుతో సంబంధం లేదు కనుకే శ్రీను వైట్లతో చేయడానికి, ఆల్రెడీ తెలుగులోకి డబ్‌ అయిన 'తెరి' రీమేక్‌ చేయడానికి అంగీకరించాడని చెప్పుకుంటున్నారు. మిగతా హీరోలంతా హిట్‌ సినిమాల కోసం నానా తంటాలు పడుతోంటే రవితేజ మాత్రం ఎవరేమైపోయినా తనకి రావాల్సింది తనకొచ్చేస్తే చాలన్నట్టు వుండడం తగదని అంటున్నారు. మరి ఈ టాక్‌ మాస్‌ మహారాజా వరకు రీచ్‌ అవుతోందో లేదో తెలీదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు