ప్రయోగం వికటించి అసలుకే ప్రమాదం

ప్రయోగం వికటించి అసలుకే ప్రమాదం

తమిళ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌కి తమిళనాట మంచి ఫాలోయింగ్‌ వుంది. పిజ్జా, జిగరదండా చిత్రాలతో దర్శకుడిగా సత్తా చాటుకున్న కార్తీక్‌ ఈసారి మూగ సినిమా తీసాడు. మాటలు లేని హారర్‌ థ్రిల్లర్‌ మెర్క్యూరీని కార్తీక్‌ రూపొందించాడు. ఈ చిత్రంలో డైలాగ్స్‌ లేకపోవడంతో అన్ని భాషల్లోను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. తమిళనాడులో సినీ పరిశ్రమ స్ట్రయిక్‌ వల్ల తమిళంలో తప్ప మిగతా భాషల్లో శుక్రవారం రిలీజ్‌ చేసారు.

కార్తీక్‌కి ఇతర భాషల్లో గుర్తింపు లేకపోవడంతో మెర్క్యూరీ చిత్రానికి తెలుగు, హిందీ నుంచి వసూళ్లు రావడం లేదు. కనీసం మల్టీప్లెక్సుల్లో కూడా ఆడియన్స్‌ లేకపోవడంతో షోస్‌ బాగా తగ్గించేసారు. అయితే తను ప్రభావం చూపించే తమిళ మార్కెట్లో సినిమా విడుదల చేయడానికి లేదు. కానీ కార్తీక్‌ అభిమానులు అతని కొత్త సినిమా చూసేందుకు ఆత్రం ఆపుకోలేక ఇతర భాషల్లో వచ్చిన పైరసీ వీడియోలు చూసేస్తున్నారు. తమిళంలో రిలీజ్‌ అయ్యేవరకు ఓపిక పట్టండి, పైరసీ చూడకండి అంటూ ప్రభుదేవా, కార్తీక్‌ ఎంత మొత్తుకుంటున్నా కానీ జనం వినడం లేదు.

కొత్త సినిమా చూడాలనే ఆత్రుత వున్నపుడు అది థియేటర్లలో అందుబాటులో లేని పక్షంలో జనం పక్క చూపులు చూసేస్తారు. రేపు ఈ చిత్రం థియేటర్లలో విడుదలైనా కానీ పైరసీ కారణంగా ఆసక్తి సన్నగిల్లిపోయే అవకాశముంది. తన మార్కెట్‌ని వదిలేసి వేరే భాషల్లో విడుదల చేయాలని చూసిన కార్తీక్‌ వేసిన తప్పటడుగు ఈ చిత్రాన్ని టోటల్‌గా ముంచేసినట్టయింది. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English