మహేష్‌ భలే ఇచ్చి పుచ్చుకుంటాడే

మహేష్‌ భలే ఇచ్చి పుచ్చుకుంటాడే

రుణం తీర్చేసుకోవడం అంటే ఏంటో మహేష్ బాబు దగ్గర నేర్చుకోవాలి అన్నట్లుగా ఉంది వ్యవహారం. అసలు విషయం ఏంటో చెప్పకుండా.. రుణాలు- తీర్చుకోవడాలు ఏంటా అనుకుంటున్నారా?

అప్పుడెప్పుడో.. కరెక్టుగా చెప్పాలంటే మహేష్ బాబు తొలి సినిమా రాజకుమారుడు ఆడియో ఫంక్షన్ కు నాగార్జున వచ్చారు. తన చేతుల మీదుగా ఆడియో లాంఛ్ చేసి.. మహేష్ బాబు శుభాకాంక్షలు చెప్పాడు. ఆ తర్వాత మెల్లగా మహేష్ సూపర్ స్టార్ గా ఎదిగాడు. తర్వాత ఈ రుణాన్ని అఖిల్ రూపంలో తీర్చుకున్నాడు. నాగార్జున కుమారుడు అఖిల్ హీరోగా నటించిన తొలి మూవీ అఖిల్ ఆడియో ఫంక్షన్ కు స్పెషల్ గెస్టుగా వచ్చి.. నాగార్జునతో రుణం తీర్చేసుకున్నాడు మహేష్ బాబు.

ఇప్పుడు ఇదే తరహాగా ఎన్టీఆర్ కు కూడా బాకీ తీర్చేసుకున్నాడు మహేష్. ఎన్టీఆర్ కెరీర్ లో పెద్ద హిట్ గా నిలిచిన ఆది చిత్రం ఆడియో విడుదలకు మహేష్ చీఫ్ గెస్టుగా అటెండ్ కాగా.. ఇప్పుడు భరత్ అనే నేను బహిరంగ సభకు యంగ్ టైగర్ వచ్చాడు. అలా ఆది అండ్ భరత్.. ఎంచక్కా ఇచ్చి పుచ్చుకున్నారు.

భరత్ అనే నేను బహిరంగ సభ వేదికగా.. మహేష్ కోరుకున్నట్లుగా ఇదే ట్రెండ్ కనుక కంటిన్యూ అయితే కొనసాగితే.. టాలీవుడ్ లో మరెన్నో ఇలాంటి వేడుకలను చూసే అవకాశం ప్రేక్షకులకు కలుగుతుందని చెప్పవచ్చు. ఎలాగూ ఎన్టీఆర్- రామ్ చరణ్ కాంబోలో రూపొందే రాజమౌళి సినిమాకు సంబంధించిన వేడుకలలో  పెద్ద పెద్ద అతిథులనే వేదికపై చూసే అవకాశం టాలీవుడ్ ఆడియన్స్ కు లభించనుంది. అక్కడకు మహేష్‌ వస్తే భలే ఉంటుందే

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు