మే సెంటిమెంటు మహేష్‌ను భయపెడుతోందా?

మే సెంటిమెంటు మహేష్‌ను భయపెడుతోందా?

ఓవైపు ‘నా పేరు సూర్య’.. మరోవైపు ‘భరత్ అను నేను’.. రెంటినీ ఏప్రిల్ 26కు షెడ్యూల్ చేసి డేట్ మార్చే ప్రసక్తే లేదని భీష్మించుకుని కూర్చున్నారు ఈ రెండు చిత్రాల నిర్మాతలు. ఇలా రెండు పెద్ద సినిమాలకు ఒకే వీకెండ్లో రావడం ఏ రకంగానూ మంచిది కాదని ఇండస్ట్రీ పెద్దలు అభిప్రాయపడుతున్నప్పటికీ ఎవ్వరూ తగ్గట్లేదు.

ఎవరికి వాళ్లు తమ సినిమా మీద కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ వీకెండ్లో ఉండే అడ్వాంటేజీని తామే ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. ఐతే ఈ పోటీని నివారించడానికి ఇండస్ట్రీ ప్రముఖులు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నట్లు సమాచారం.

‘నా పేరు సూర్య’కు ముందుగా డేట్ ఇచ్చిన నేపథ్యంలో ‘భరత్ అను నేను’ సినిమా నిర్మాతే డేట్ మార్చుకోవాలని సూచిస్తున్నట్లు సమాచారం. ఐతే తమ సినిమాను వేరే తేదీకి మార్చుకునే సౌలభ్యం లేదని నిర్మాత అంటున్నాడట. ఏప్రిల్ చివర్నుంచి సినిమాను వెనక్కి పంపితే మేలో రిలీజ్ చేయాలి. ఐతే మే అనగానే మహేష్ బాబును ఫ్లాప్ సెంటిమెంటు వెంటాడుతుంది.

ఈ నెలలో రిలీజైన మహేష్ సినిమాలేవీ ఆడలేదు. ‘నిజం’.. ‘నాని’.. ‘బ్రహ్మోత్సవం’.. ఇలా అన్నీ డిజాస్టర్లే అయ్యాయి ఈ నెలలో. మే నెల కాదంటే సినిమా మరీ లేటైపోతుంది. జూన్లో రావడం వల్ల సమ్మర్ అడ్వాంటేజీ మిస్సవుతుంది. ఐతే ఏప్రిల్ నెలాఖరు నుంచి ముందుకు తెద్దామంటే.. సినిమాను అప్పటికి రెడీ చేయడం కష్టమని అంటున్నారట. అందుకే ‘నా పేరు సూర్య’ సినిమాను వాయిదా వేసుకుని.. మేలో రిలీజ్ చేసుకోమని అడుగుతున్నారట. మరి ఈ చర్చలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు