అర్జున్ రెడ్డి క్రేజ్ అలాంటిది మరి

అర్జున్ రెడ్డి క్రేజ్ అలాంటిది మరి

‘అర్జున్ రెడ్డి’ సినిమాకు ముందు రోజు వేసిన ప్రివ్యూలు.. రిలీజ్ తర్వాత ఫస్ట్ వీకెండ్లో షోలు చూసిన వాళ్లు షాకైపోయారు. ఈ సినిమాలో కంటెంట్ ఒక షాకైతే.. ఆ సినిమాకు ముందే వచ్చిన క్రేజ్ మరో ఎత్తు. ఒక సూపర్ స్టార్ సినిమా చూస్తున్నట్లుగా అరుపులు.. కేకలతో థియేటర్లను హోరెత్తించేశారు కుర్రాళ్లు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఇంట్రడక్షన్ సీన్లలో.. ఆ తర్వాత అతడి యాటిట్యూడ్ చూపించినపుడు యూత్ ఆడియన్స్ గోల గోలే.

మామూలుగా పెద్ద పెద్ద స్టార్ల సినిమాలకు మాత్రమే థియేటర్లలో ఇలాంటి సందడి ఉంటుంది. దీన్ని బట్టే విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ ఏ రేంజికి చేరిందో జనాలకు అర్థమైంది. చాలామంది ఈ క్రేజ్ చూసి ఆశ్చర్యపోయారు. ఈ సినిమాను అమేజాన్ ప్రైంలో రిలీజ్ చేసినపుడు.. టీవీల్లో వేసినపుడు కూడా ఇదే క్రేజ్ కనిపించింది.

‘అర్జున్ రెడ్డి’ విడుదలైన ఆరు నెలల తర్వాత కూడా ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో క్రేజ్ తగ్గలేదనడానికి మరో రోజువు దొరికింది. మొన్న మహాశివరాత్రి సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో స్పెషల్ మిడ్ నైట్ షోలు వేశారు. ఇలాంటి టైంలో స్టార్ హీరోల సినిమాలు వేస్తుంటారు. ఐతే సూపర్ స్టార్ల సినిమాల కంటే కూడా ‘అర్జున్ రెడ్డి’కే అత్యధిక కలెక్షన్లు రావడం విశేషం.

దేవి థియేటర్లలో ‘అర్జున్ రెడ్డి’కి 80,570 రూపాయల కలెక్షన్ రాగా.. సరైనోడు రూ.72,110 కలెక్షన్‌తో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా ‘ధృవ’ (రూ..52.700), ఫిదా (రూ.38,504), శ్రీమంతుడు (రూ.35,750), ఆనందో బ్రహ్మ ‘(రూ.28,150),  నాన్నకు ప్రేమతో (రూ.23,943) సినిమాలు నిలిచాయి. దీన్ని బట్టి ‘అర్జున్ రెడ్డి’ మేనియా ఇప్పటికీ జనాల్ని ఊపేస్తోందని అర్థం చేసుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు