ఈ శుక్రవారం 13 సినిమాలొస్తున్నాయ్‌

ఈ శుక్రవారం 13 సినిమాలొస్తున్నాయ్‌

భారీ సినిమాలతో పోటీకి వెళ్లకుండా, అవకాశం దొరికినప్పుడల్లా అదృష్టం పరీక్షించుకుంటోన్న చిన్న సినిమాల నిర్మాతలు వచ్చే వారం నుంచి మళ్లీ పెద్ద సినిమాల సందడి వుంటుందనే భయంతో ఈవారంలోనే తమ సినిమాలు విడుదల చేసేస్తున్నారు. ఈ శుక్రవారం రికార్డు స్థాయిలో పదమూడు సినిమాలు విడుదలవుతున్నాయి. వీటిలో ఒక్కటి కూడా జనాకర్షణ వున్న సినిమా లేకపోవడం గమనార్హం.

ఈమధ్య వారానికి అరడజనుకి పైగా కొత్త సినిమాలు రావడం పరిపాటి అయిపోయింది. అయితే చాలా సినిమాలకి ప్రేక్షకులు వుండడం లేదు. అన్ని చిత్రాలకీ ఆదరణ కరవవుతోంది. కొన్ని చోట్ల కొత్త సినిమాలకి కూడా జనం లేక షోస్‌ కాన్సిల్‌ చేస్తున్నారు. సీత, కుటుంబ కథా చిత్రమ్‌, జూలియట్‌ లవరాఫ్‌ ఇడియట్‌, 10, మామా ఓ చందమామ, పడిపోయా నీ మాయలోనే, కిస్‌ కిస్‌ బాంగ్‌ బాంగ్‌, ఇదీ మా ప్రేమకథ, ఉందా లేదా, తొలి పరిచయం, లచ్చి, ప్రేమపందెం, మరో దృశ్యం చిత్రాలు విడుదలవుతున్నాయి.

వీటిలో కనీసం ఒక్కటైనా థియేటర్‌ రెంట్లయినా రాబట్టుకుంటాయో లేదో. ట్రేడ్‌ మాత్రం ఈ వారాంతాన్ని వదిలేసి వచ్చే వారం రాబోతున్న మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి, హలో చిత్రాల కోసం చూస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English