పాపం 'డిజె'కి మాత్రం దొరకట్లేదు

పాపం 'డిజె'కి మాత్రం దొరకట్లేదు

'డిజె' సినిమా హిట్‌ అని హరీష్‌ శంకర్‌ అప్పట్లో మైక్‌ పట్టుకుని చాలా చెప్పాడు. దిల్‌ రాజు ఇప్పటికీ ఆ సినిమాని హిట్‌ అనే చెప్పుకుంటున్నాడు. రీసెంట్‌గా టీవీ ప్రీమియర్‌కి టీఆర్పీలు బాగా వచ్చేసరికి ఇది జనర మెచ్చిన సినిమా అనే కలర్‌ ఇవ్వడానికి ప్రయత్నించారు. అయితే హిట్టు సినిమా తీసినపుడు అదే మాట్లాడుతుంది. ఎవరూ దానికి ప్రత్యేకించి డప్పు వేయనక్కర్లేదు.

హిట్‌ సినిమా డైరెక్టర్‌తో పని చేయడానికి హీరోలు వెంటనే క్యూ కడతారు. అనిల్‌ రావిపూడి తీసిన 'రాజా ది గ్రేట్‌' సినిమానే తీసుకుంటే, దీనిని ఎవరూ పెద్దగా ప్రశంసించలేదు. కానీ ఈ చిత్రం విజయవంతమైంది. ముఖ్యంగా అనిల్‌ రావిపూడి రాసిన కామెడీ సీన్లని మెచ్చుకున్నారు. దీంతో అతడికి వెంటనే మరో సినిమా వచ్చేసింది.

వెంకటేష్‌ డేట్లు సంపాదించాడు. ఒక మల్టీస్టారర్‌కి శ్రీకారం చుడుతున్నాడు. మరోవైపు హరీష్‌ శంకర్‌కి టాప్‌ హీరోలు అటుంచి నాని, శర్వానంద్‌ నుంచి కూడా సానుకూల స్పందన రాలేదని చెప్పుకుంటున్నారు. దీంతో కొత్తవాళ్లతో సినిమా చేసి తన వెర్సటాలిటీ చూపించాలని హరీష్‌ డిసైడ్‌ అయ్యాడట. ఇంకా దీనికి సంబంధించి దిల్‌ రాజు నుంచి సిగ్నల్‌ రాలేదు. హరీష్‌తో మలి చిత్రం చేస్తున్నాడు కానీ అదెప్పుడు అనేది క్లారిటీ లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు