మహేష్‌కిది మామూలు డ్యామేజ్ కాదు

మహేష్‌కిది మామూలు డ్యామేజ్ కాదు

ప్రతి హీరో కెరీర్లోనూ హిట్లుంటాయి. సూపర్ హిట్లుంటాయి. బ్లాక్ బస్టర్లుంటాయి. అలాగే యావరేజ్‌లు, ఫ్లాపులు, డిజాస్టర్లు కూడా ఉంటాయి. ఐతే మహేష్ బాబు విషయంలో మాత్రం వేరే కేటగిరీలేమీ కనిపించట్లేదు. అయితే బ్లాక్ బస్టర్.. లేకుంటే డిజాస్టర్ అన్నట్లే ఉంది. యావరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు.. పూర్తి నెగెటివ్ టాక్ రాని సినిమాలు కూడా డిజాస్టర్లుగానే నిలుస్తుండటం అతడి అభిమానులకు ఆందోళన కలిగించే విషయమే. పేరుకు సూపర్ స్టారే కానీ.. మహేష్ నటించిన గత ఐదు సినిమాల్లో నాలుగు డిజాస్టర్లుగా తేలాయి.

ఒక్క ‘శ్రీమంతుడు’ మినహాయిస్తే మిగతా నాలుగూ దారుణమైన ఫలితాలు చవిచూశాయి. వీటిలో మరీ పేలవమైన సినిమా అంటే ‘బ్రహ్మోత్సవం’ అనే చెప్పాలి. మిగతా సినిమాలకు మరీ అంత నెగెటివ్ టాకేమీ రాలేదు. ‘1 నేనొక్కడినే’, ‘ఆగడు’ సినిమాలకు డివైడ్ టాక్ వినిపించింది. ఇప్పుడు ‘స్పైడర్’ విషయంలోనూ టాక్ అటు ఇటుగా వినిపించింది. కానీ చివరికి ఫలితం మాత్రం దారుణంగానే ఉండేలా ఉంది. మహేష్ మిగతా సినిమాల పరిస్థితీ ఇంతే. అంచనాలకు అందని స్థాయిలో అతడి సినిమాలు డిజాస్టర్లవుతున్నాయి. క్రిటిక్స్ అయితే ఈ సినిమాల్ని డిజాస్టర్ అని కూడా కాకుండా డబుల్ డిజాస్టర్ అని కూడా అంటున్నారు.

మామూలుగా ఒక హీరో సినిమా ఫ్లాప్ అయితే.. దాని ప్రభావం తర్వాతి సినిమా బిజినెస్ మీద పడుతుంది. కానీ మహేష్ విషయంలో అలా జరగట్లేదు. ప్రతిసారీ బిజినెస్ పెరుగుతోంది. దానికి తగ్గట్లే నష్టాలు కూడా పెరుగుతున్నాయి. గత నాలుగేళ్ల వ్యవధిలో మహేష్ సినిమాల వల్ల నష్టాలు రూ.150 కోట్లకు పైగా ఉండటం గమనార్హం. అందులోనూ ‘స్పైడర్’ సినిమాతో అతడి ఇమేజ్‌కు బాగానే డ్యామేజ్ జరిగింది. డిజాస్టర్ స్టార్ అని.. ఇతనేం సూపర్ స్టార్ అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది ప్రస్తుతం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English