పవన్ సినిమా పోస్టర్లో ఏముంది?

పవన్ సినిమా పోస్టర్లో ఏముంది?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకు సంబంధించి సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంటూ ఊరించి.. సినిమా పేరు లేకుండా కాన్సెప్ట్ పోస్టర్ మాత్రమే రిలీజ్ చేశారు. ఐతే ఈ పోస్టర్ చూశాక ఇందులో ఉన్న కాన్సెప్ట్ ఏంటబ్బా అని బుర్రలు బద్దలు కొట్టేసుకుంటున్నారు అభిమానులు. ఓవైపు పవన్ దీర్ఘాలోచనలో కనిపిస్తుంటే.. ఇంకోవైపు ఎటో నడుస్తున్నట్లుగా చూపించారు. బ్యాగ్రౌండ్లో మ్యాచ్ కనిపిస్తోంది. దీన్ని బట్టి కాన్సెప్ట్ ఏంటన్నది అంచనా వేయడం జనాలకు కష్టంగానే ఉంది. ఈ పోస్టర్ చూసి ఎవరికి నచ్చినట్లు.. ఎవరికి అర్థమైనట్లు వాళ్లు భాష్యం చెబుతున్నారు.

తన గురించి తాను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్న ఒక మనిషి కథ ఇది అని కొందరు.. అన్నీ వదిలేసి అజ్నాతవాసం వైపు అడుగులేస్తున్న వ్యక్తి కథ అని మరికొందరు.. తన ఆలోచనల వెంట పయనిస్తున్న వ్యక్తి ప్రయాణం అని ఇంకొందరు.. ఇలా రకరకాలుగా ఈ పోస్టర్ ను విశ్లేషించే ప్రయత్నం చేశారు. వీటన్నింటికీ భిన్నంగా ఏ కాన్సెప్ట్ లేకపోవవడమే ఆ కాన్సెప్ట్ పోస్టర్ కాన్సెప్ట్ అంటూ కొందరు సెటైర్లు కూడా వేశారు.

ఇంతకీ త్రివిక్రమ్ ఆలోచన ఏంటన్నది అతనే చెప్పాలి. సినిమా టైటిలే ప్రకటించకుండా ఇలా కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేయడం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయమే. దీంతో పాటుగా ఈ సినిమాతోనే టాలీవుడ్లోకి అడుగుపెడుతున్న అనిరుధ్ రవిచందర్.. పవన్ కోసం మరో సర్ప్రైజ్ ప్లాన్ చేశాడట. శుక్రవారం అర్ధరాత్రి దాటాక 3 గంటలకు ఈ సర్ప్రైజ్ అభిమానుల్ని పలకరిస్తుందట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు