రామోజీ రేంజ్ ఏంటో ఆ రోజు చూస్తారు!

రామోజీ రేంజ్  ఏంటో ఆ రోజు చూస్తారు!

మీడియా మొఘ‌ల్ గా సుప‌రిచితుడైన చెరుకూరి రామోజీరావు అలియాస్ ఈనాడు అధినేత రేంజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. తెలుగువాళ్ల‌లో అత్యంత శ‌క్తివంత‌మైన వ్య‌క్తిగా ఆయ‌న గురించి అంద‌రికి తెలిసిందే. అయితే.. తాజాగా మ‌రోసారి ఆయ‌న ఎంత ప‌వ‌ర్ ఫుల్ అన్న విష‌యం మ‌రో రోజు వ్య‌వ‌ధిలో ప్ర‌పంచానికి తెలియ‌నుంద‌ని చెప్పాలి.

మీడియాలో సుదీర్ఘ‌కాలంగా కొన‌సాగ‌ట‌మే కాదు.. వివిధ రంగాల మీద అప‌రిత‌మైన ప‌ట్టును ఆయ‌న ప్ర‌ద‌ర్శిస్తార‌న్న‌ది తెలిసిందే. ఈ నెల 28న (శుక్ర‌వారం) ఆయ‌న పెద్ద‌కుమారుడు కిర‌ణ్ కుమార్తె వివాహం రామోజీ ఫిలింసిటీలో జ‌ర‌గ‌నుంది.

ఈ పెళ్లి వేడుక ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఈ పెళ్లి వేడుక‌ను రామోజీ త‌న రేంజ్లో చేయ‌టానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. పెళ్లి కోసం ప్ర‌త్యేకంగా రామోజీ ఫిలింసిటీలో సెట్ వేయ‌టంతో పాటు..క‌ళ్లు చెదిరే ఏర్పాట్లు జ‌రుగుతున్న‌ట్లుగా తెలుస్తోంది.

ఎవ‌రూ ఊహించ‌ని స్థాయిలో ఉంటుంద‌ని చెబుతున్న ఈ పెళ్లికి దేశ వ్యాప్తంగా ఉన్న వీవీఐపీలు రావ‌టం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. ఈ పెళ్లికి వ‌చ్చే అతిధుల్ని జాగ్ర‌త్త‌గా చూసుకునేందుకు పెద్ద ఎత్తున బృందాల్ని ఏర్పాటు చేయ‌టంతో పాటు.. ఏ ప్ర‌ముఖుడ్ని ఏ విధంగా పెళ్లి మండ‌పంలో చూసుకోవాల‌న్న అంశంపైనా రిహార్స‌ల్స్ చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. గ‌డిచిన మూడు రోజులుగా ఇది జ‌రుగుతున్న‌ట్లుగా తెలుస్తోంది. త‌న మ‌న‌మ‌రాలి పెళ్లితో.. రామోజీ రేంజ్ మ‌రోసారి తెలుస్తుంద‌ని చెప్ప‌టంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు