సుచీ లీక్స్‌పై ఆ స్పందన కరక్ట్‌ కాదు: ధనుష్‌

సుచీ లీక్స్‌పై ఆ స్పందన కరక్ట్‌ కాదు: ధనుష్‌

టీవీ 9 ఇంటర్వ్యూలో సుచీ లీక్స్‌ గురించి అడిగిన ప్రశ్నకి ఇబ్బంది పడిన ధనుష్‌ 'స్టుపిడ్‌ ఇంటర్వ్యూ' అని తిట్టేసి అక్కడ్నుంచి లేచి వచ్చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ధనుష్‌ని బుజ్జగించి 'విఐపి 2' సినిమా గురించి మాత్రమే అడిగారనుకోండి. అయితే సుచీ లీక్స్‌ మేటర్‌పై స్పందించడం ఇష్టం లేదనో లేదా ఏదైనా తెలివైన సమాధానమో ఇస్తే పోయే దానికి ధనుష్‌ ఎందుకలా రియాక్ట్‌ అయ్యాడనేది అందరినీ ఆశ్చర్యపరిచింది.

బహుశా తనని మీడియా దాని గురించి డైరెక్టుగా అడుగుతుందని ధనుష్‌ ఊహించినట్టు లేడు. అయితే ఈ వ్యవహారంలో ధనుష్‌కి ఫాన్స్‌ మద్దతు లభించినా కానీ తటస్థులు మాత్రం తప్పుబడుతున్నారు. తనలో తప్పు వుండబట్టే ధనుష్‌ సమాధానం ఇవ్వలేకపోయాడని, అలా రియాక్ట్‌ అయ్యాడని అంటున్నారు. ఇప్పుడు ధనుష్‌ కూడా తాను అలా ప్రవర్తించి వుండాల్సింది కాదని అన్నాడు. రెండు వారాల నుంచి సరిగా నిద్ర లేని కారణంగా అలా అనుకోకుండా స్పందించానని, తర్వాత ఆ వీడియో చూస్తుంటే బెటర్‌గా హ్యాండిల్‌ చేసి వుండాల్సింది అనిపించిందని చెప్పాడు.

సుచీ లీక్స్‌ వ్యవహారంతో ధనుష్‌కి లింక్‌ వుందనే ఊహాగానాలని బలోపేతం చేసిన ఈ ఘటన అతడిని దోషిగానూ చూపిస్తోంది. డ్యామేజ్‌ కంట్రోల్‌ కోసమే ధనుష్‌ మళ్లీ ఈ టాపిక్‌పై వివరణ ఇచ్చినట్టున్నాడని సోషల్‌ మీడియాలో వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు