రెండో పాత్ర కోసం 15 కిలోల తగ్గాడట

రెండో పాత్ర కోసం 15 కిలోల తగ్గాడట

ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు అన్న సంగతి అందరికీ తెలుసు. దీనికి సంబంధించి నిన్నట్నుంచే హడావుడి మొదలైంది. తారక్ పుట్టిన రోజు కానుకగా ‘జై లవకుశ’ ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేయడంతో నందమూరి అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.

ఐతే ఇదే రోజు మరో టాలీవుడ్ హీరో కూడా పుట్టాడు. అతనే మంచు మనోజ్. ఈ సందర్భంగా మనోజ్ కొత్త సినిమాకు సంబంధించిన కొత్త లుక్ కూడా రిలీజ్ చేశారు. మనోజ్.. అజయ్ నూతక్కి అనే దర్శకుడితో ‘ఒక్కడు మిగిలాడు’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో అతను ఎల్టీటీఈ లీడర్ ప్రభాకరన్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి లుక్ ఇప్పటికే పరిచయం చేశారు.

విశేషం ఏంటంటే ‘ఒక్కడు మిగిలాడు’లో మనోజ్.. ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. కాలేజీ స్టూడెంట్‌గా ఇంకో పాత్ర కూడా పోషిస్తున్నాడు. దానికి సంబంధించిన లుక్ మనోజ్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేశారు. రెండు పాత్రల మధ్య వేరియేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. మనోజ్.. రెండో పాత్ర కోసం 15 కిలోల బరువు తగ్గాడట. రెండు పాత్రలు సినిమాలో పూర్తి భిన్నంగా.. ఇద్దరూ ఒకరేనా అనిపించేలా ఉంటాయని.. మనోజ్ కెరీర్లో ఇది బెస్ట్ సినిమా.. బెస్ట్ పెర్ఫామెన్స్ అవుతుందని అంటున్నాడు దర్శకుడు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. జూన్ లేదా జులైలో సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రంలో మనోజ్ సరసన అనీషా ఆంబ్రోస్ నటించింది. ఎస్.ఎస్.రెడ్డి నిర్మించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు