శర్వానంద్ పెద్ద రిస్కే చేస్తున్నాడు

శర్వానంద్ పెద్ద రిస్కే చేస్తున్నాడు

వరుసగా నాలుగు హిట్లు కొట్టేసి ఊపుమీదున్నాడు శర్వానంద్. తాజాగా ఈ సంక్రాంతికి 'శతమానం భవతి' రూపంలో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. చంద్రమోహన్ అనే కొత్త దర్శకుడితో శర్వా చేస్తున్న 'రాధ' మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి. దీని తర్వాత మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు శర్వా.

ఐతే దీని తర్వాత అతను కమిటైన సినిమా ఆశ్చర్యం కలిగించేదే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడితో శర్వా పని చేయబోతున్నట్లు సమాచారం. ప్రకాష్ ట్రాక్ రికార్డు తెలిసిన వాళ్లందరూ శర్వా ఇంత రిస్క్ చేస్తున్నాడేంటని ఆశ్చర్యపోతున్నారు.

ప్రకాష్ తొలిసారి దర్శకత్వం వహించిన 'అనగనగా ఒక ధీరుడు' భారీ అంచనాల మధ్య విడుదలై.. డిజాస్టర్ అయింది. ఆ తర్వాత రెండేళ్ల కిందట 'సైజ్ జీరో' అనే సినిమా తీశాడు ప్రకాష్. దీనికి కూడా బాగానే హైప్ వచ్చింది. కానీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో ప్రకాష్‌కు మళ్లీ ఇంకో అవకాశం దక్కడం కష్టమే అనుకున్నారంతా. కానీ అతను మళ్లీ ఇంకో నిర్మాతను సెట్ చేసుకున్నాడు. వరుస హిట్లతో ఊపుమీదున్న శర్వాను ఓ కథతో మెప్పించాడు. మారుతి సినిమా పూర్తయ్యాక శర్వా నటించబోయే చిత్రం ఇదేనట.

ఐతే శర్వా ఏ ధైర్యంతో ఈ సినిమా ఒప్పుకున్నాడా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఐతే సతీశ్ వేగేశ్న తొలి రెండు సినిమాలు ఫ్లాపైనా అతణ్ని నమ్మి 'శతమానం భవతి' చేసి మంచి ఫలితాన్నందుకున్న శర్వా.. ప్రకాష్‌కు కూడా ఇంకో అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు