న‌మో వెంక‌టేశాయ.. మ‌ళ్లీ స‌స్పెన్సులో పెట్టాడు

న‌మో వెంక‌టేశాయ.. మ‌ళ్లీ స‌స్పెన్సులో పెట్టాడు

‘ఓం న‌మో వెంక‌టేశాయ’ మొద‌లైన‌పుడు సంక్రాంతి రిలీజ్ అన్నారు. షూటింగ్ చ‌క‌చ‌కా సాగిపోవ‌డంతో పండ‌క్కి ప‌క్కా అనే అనుకున్నారంతా. కానీ స‌డెన్ గా నాగార్జున అండ్ కో రిలీజ్ విష‌యంలో యు ట‌ర్న్ తీసుకుంది. గ్రాఫిక్స్.. విజువ‌ల్ ఎఫెక్ట్స్ విష‌యంలో రాజీ ప‌డే ప్ర‌స‌క్తే లేద‌ని.. కాబ‌ట్టి సంక్రాంతి రిలీజ్ క‌ష్ట‌మే అని నాగార్జున స్ప‌ష్టం చేశాడు. ఫిబ్ర‌వ‌రిలో ఈ చిత్రం రిలీజ‌వుతుంద‌ని ప్ర‌క‌ట‌న కూడా చేశాడు నాగ్. ఐతే ఇప్పుడు నాగార్జున మ‌రోసారి రిలీజ్ విష‌యంలో కొత్త ప‌ల్ల‌వి అందుకున్నాడు. ఫిబ్ర‌వ‌రిలో కూడా ‘ఓం న‌మో వెంక‌టేశాయ’ రిలీజ్ క‌ష్ట‌మే అని చెప్పేశాడు.

‘‘ఓం నమో వెంకటేశాయ ఫిబ్రవరిలో కూడా విడుదలవుతుందని నేననుకోను. కంప్యూట‌ర్ గ్రాఫిక్స్.. విజువల్ ఎఫెక్ట్స్ పనులు చాలా కావాల్సి ఉంది. ఇప్పుడు మన బాహుబలి లాంటి సినిమాలు విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఒక స్టాండర్ట్ సెట్ చేశాయి. వాటితో పోల్చిచూస్తారు కాబట్టి ఎఫెక్ట్స్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాం. కాబ‌ట్టి ఫిబ్ర‌వ‌రి విడుద‌ల విష‌యంలోనూ సందేహ‌మే. అంతా అయిపోయాక.. నేను మెచ్చితేనే సినిమా బయటకు వస్తుంది. ఈ విషయంలో రాజీ పడట్లేదు కాబట్టే రిలీజ్ ఎప్పుడదనేది చెప్పలేకపోతున్నా’’ అని నాగ్ స్ప‌ష్టం చేశాడు.

నాగ్ మాట‌ల్ని బ‌ట్టి చూస్తుంటే ఈ సినిమా స‌మ్మ‌ర్ రేసులో నిలిచేలా క‌నిపిస్తోంది. ఐతే బాహుబ‌లి-2, కాట‌మ‌రాయుడు, మ‌హేష్‌-మురుగ‌దాస్ సినిమా, దువ్వాడ జ‌గ‌న్నాథం.. ఇలా స‌మ్మ‌ర్ రేసులో భారీ చిత్రాలు రేసులో ఉన్న నేప‌థ్యంలో ‘ఓం న‌మో వెంక‌టేశాయ‌’కు ఇబ్బందులు త‌ప్ప‌వేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు