ఎన్టీఆరే అన్నయ్యని ఆదుకోవాలి

ఎన్టీఆరే అన్నయ్యని ఆదుకోవాలి

మధ్యలో పటాస్‌ ఒకటి హిట్‌ అయి కాస్త డబ్బులు చేసుకుంది కానీ, అది మినహాయిస్తే కళ్యాణ్‌రామ్‌ తీసిన సినిమాల్లో చాలా వరకు అతడిని ముంచేసినవే. ఓం 3డి సినిమా ఎఫెక్ట్‌ నుంచి కళ్యాణ్‌రామ్‌ నేటికీ తేరుకోలేదు. తాజాగా 'ఇజం'తో అయిదు కోట్ల వరకు నష్టపోయాడని టాక్‌ వుంది. నష్టపోయిన సినిమాల వల్ల అప్పుల్లో పడ్డ కళ్యాణ్‌రామ్‌ అవన్నీ తన తమ్ముడు ఎన్టీఆర్‌తో తీసే సినిమాతో తీర్చేద్దామని చూస్తున్నాడు. జనతా గ్యారేజ్‌ తర్వాత కళ్యాణ్‌రామ్‌ బ్యానర్లోనే వక్కంతం వంశీ దర్శకత్వంలో చేయడానికి ఎన్టీఆర్‌ సై అన్నాడు. కానీ జనతా గ్యారేజ్‌ తర్వాత కొత్త దర్శకుడు వద్దని డిసైడ్‌ అవడంతో ఆ సినిమా అటకెక్కింది.

దర్శకుడు మారినా నిర్మాతగా కళ్యాణ్‌రామ్‌కే అవకాశం ఇస్తాడని అనుకుంటున్నారు. అయితే ఇంతవరకు తన తదుపరి చిత్రం గురించి ఎన్టీఆర్‌ ఎటూ తేల్చలేదు. టాప్‌ దర్శకుడితో సెట్‌ అయితే కనుక అతను ఆల్రెడీ అడ్వాన్స్‌ తీసుకున్న నిర్మాతకే సినిమా చేయాల్సి వస్తుంది. కళ్యాణ్‌రామ్‌ బ్యానర్లోనే చేద్దామంటే ఇప్పటికిప్పుడు దర్శకులు దొరకడం కష్టమవుతుంది. అసలు ఎన్టీఆర్‌ తదుపరి చిత్రం తనతోనే చేస్తాడా లేదా అనే టెన్షన్‌ కళ్యాణ్‌రామ్‌ని కూడా పీడిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు తనకున్న తిప్పలు, అప్పులు తీరాలంటే ఎన్టీఆర్‌తో సినిమా చేయడం ఒక్కటే దారి. మరి అన్నయ్యని ఆదుకోవడానికి ఏ దర్శకుడైనా ఓకే అనుకుని ఎన్టీఆర్‌ కాస్త రాజీ పడతాడో లేదో చూడాలి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు