క్లిక్‌ చేస్తే కంప్యూటర్‌ సర్వనాశనం

క్లిక్‌ చేస్తే కంప్యూటర్‌ సర్వనాశనం

సెలబ్రిటీల కబుర్ల కోసం ఇంటర్నెట్‌లో 'సెర్చ్‌' కొట్టేవారిని భయంకరమైన వైరస్‌లు భయపెడ్తున్నాయి. సన్నీలియోన్‌ పేరు టైప్‌ చేస్తే ఒకలా, ప్రియాంకా చోప్రా పేరు టైప్‌ చేస్తే మరోలా ఇంటర్నెట్‌ వైరస్‌లు విరుచుకుపడ్తుండడంతో ఇంటర్నెట్‌ వినియోగదారులు తమ కంప్యూటర్లకు 'రక్షణ కవచాలు' ఏర్పాటు చేసుకోవడమెలాగో తెలియక సతమతమవుతున్నారు. ఎన్నో యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌లు ఉన్నా, వాటిని తలదన్నేలా వైరస్‌లు ఇంటర్నెట్‌కి సవాల్‌ విసరడం గమనించదగ్గది.

వైరస్‌లను ఎట్రాక్ట్‌ చేస్తున్న అందాల భామలు వీళ్ళే

ప్రియాంకా చోప్రా: ఈమె పేరు టైప్‌ చేయడం వరకూ ఓకే. లింక్‌లను అశ్రద్ధగా క్లిక్‌ చేశారో మటాష్‌. వైరస్‌ల లిస్ట్‌లో టాప్‌ సెలబ్రిటీ ప్రియాంకా చోప్రానే. పారితోషికం, సక్సెస్‌లలోనే కాదు, వైరస్‌ ఫ్రెండ్లీ యాక్ట్రెస్‌గా కూడా ప్రియాంక నెంబర్‌ వన్‌ ప్లేస్‌లో ఉందిప్పుడు.

శ్రద్ధాకపూర్‌: బాలీవుడ్‌లోకి అతి తక్కువ కాలంలోనే స్టార్‌గా దూసుకొచ్చిన ఈ భామ, 'పోకీ పోకీ పోకీ' అంటూ ఓ యాడ్‌లో నటించి, కుర్రాళ్ళకి కంటిమీద కునుకు లేకుండా చేసింది. అలాగే వైరస్‌లనీ ఎట్రాక్ట్‌ చేసింది. శ్రద్ధాకపూర్‌ జోలికి వెళితే, మీ కంప్యూటర్‌ని వైరస్‌కి ఆహారంగా పడేసినట్టే.

జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌: సెక్సీ సెక్సీ శ్రీలంక బ్యూటీ జాక్వెలైన్‌ ఫెర్నాండెస్‌, బాలీవుడ్‌ హీరోలనే కాకుండా ఇంటర్నెట్‌ వైరస్‌లనీ తన గ్లామర్‌తో కట్టిపడేసింది. అందుకే జాక్వెలైన్‌ మీద ఇంటర్నెట్‌ యూజర్స్‌ మనసు పారేసుకుంటే, వైరస్‌లు కాటేసేస్తాయ్‌. తస్మాత్‌ జాగ్రత్త. ఇంకెందరో ఉన్నారుగానీ, ఇప్పటికైతే వీళ్ళే ఇంటర్నెట్‌ వైరస్‌ని తమతో తీసుకొచ్చే ప్రముఖులు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు