*సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహాశెట్టి నాయికగా ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’ ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రం.
*కథానాయకుడు ‘సిద్ధు జొన్నలగడ్డ‘ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షల వీడియో విడుదల చేసిన చిత్రం యూనిట్.
టాలీవుడ్ లోని ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్ యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా,‘నేహాశెట్టి‘ నాయికగా ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం విదితమే.’కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రానికి రచయిత గానూ,దర్శకత్వ శాఖలో పనిచేసిన ప్రతిభ గల యువకుడు విమల్ కృష్ణ ను ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశి.
నేడు చిత్ర కథానాయకుడు ‘సిద్ధు జొన్నలగడ్డ‘ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షల తో కూడిన వీడియోను విడుదల చేసింది చిత్రం యూనిట్. ఈ వీడియో, అందులోని ఆసక్తికరమైన సంభాషణ ఏమిటో పరికించి చూస్తే అర్థమవుతుంది ఇది ఖచ్చితగా విభిన్న కథాచిత్రమని. ఇందులో కథానాయకుడు సిద్ధు ఎవరితోనో సంభాషణ ఈ విధంగా సాగుతుంది…..
”అరె సత్తి షోల్డర్ మసాజ్ చెయ్యరా…
సాయంత్రం సాంగ్ లాంచ్ ఉన్నది
పార్టీలోన… జిమ్ కొడుతున్నట్టున్నావ్ గా గట్టిగా
ఏడరా… మొత్తం కీటో డైట్ మీదున్నా నేను
ఏందన్నా… అది
కీటో డైట్ రా… రైస్ తినం… ఆలుగడ్డ తినం… ఖాళీ ప్రోటీన్ తింటాం… ఫాట్ తింటాం..నో కార్బో హైడ్రేట్..
డైట్ లో ఫాట్ తింటావా అన్నా…
మరి… ఫాటే కదరా లోపలికి పోయి ఫాట్ ను కట్ చేసేటిది.
ఏ… ఊరుకో అన్నా మజాక్ చేయకు ప్లీజ్
అరె… హవులే…. డైమండ్ ను ఎట్లా కోస్తారో తెలుసారా నీకు ఆ…
చెప్పు..
డైమండ్ తోని….
నిజంగానా…
ఎట్టుంటది మరి మనతోని….
తిన్న ప్రొటీనంతా ఏడికి పోతుందిరా టిల్లు…..
గమ్మత్తుగా సాగే ఈ సంభాషణ ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రంలో ఏ సందర్భంలో వస్తుందో వెండితెరపై చూడాల్సిందే”….
పి.డి.వి.ప్రసాద్ సమర్పణలోనిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.
కొత్త తరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రమిది అని తెలిపారు దర్శకుడు విమల్ కృష్ణ.
చిత్రంలో ప్రిన్స్ ఓ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ఇతర ప్రధాన పాత్రలలో, బ్రహ్మాజీ, నర్రాశ్రీనివాస్ ఇప్పటివరకు ఎంపికైన తారాగణం.
This post was last modified on February 8, 2021 12:34 am
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…