Political News

ఇజ్రాయెల్‌, ఇరాన్‌ యుద్ధం.. అమెరికా ఏం చేస్తోందంటే..

ఇరాన్ ఇటీవల అమెరికా సైనిక సిబ్బందిని ఇజ్రాయెల్‌లోని ప్రదేశాల నుంచి దూరంగా ఉంచాలని హెచ్చరికలు జారీ చేసింది. కానీ, అమెరికా మరింత దూకుడుగా ఇజ్రాయెల్‌కు మద్దతు అందిస్తోంది. ఆ దేశంలో అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థను సిద్ధం చేసినట్లు ప్రకటించింది. ఇరాన్ క్షిపణి దాడుల ప్రతిఘటనా చర్యగా, ఇజ్రాయెల్ ఈ వ్యవస్థలను చక్కగా ఉపయోగించేందుకు సిద్ధమవుతుందని అమెరికా పేర్కొనడం, పశ్చిమాసియాలో తీవ్ర ఆందోళనను కలిగించింది.

ఇరాన్ కు అమెరికా శతృదేశాలు తోడైతే ఎక్కడ వరల్డ్ వార్ 3 మొదలవుతుందేమో అనే భయం కూడా చాలా దేశాల్లో ఉంది. ఇక అమెరికా సైనిక శాఖ, పెంట్‌గాన్ ద్వారా ప్రకటించినట్టు, టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ బ్యాటరీ (టీహెచ్ఏఏడీ)ని ఇజ్రాయెల్‌కు పంపిస్తున్నట్లు తెలిపింది. ఈ వ్యవస్థ బాలిస్టిక్ క్షిపణులను నిరోధించేందుకు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల ప్రకారం, రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఈ చర్యకు అనుమతి ఇచ్చారని ప్రకటించారు. ఇరాన్ ఈ క్రమంలో అమెరికాపై ఆరోపణలు చేస్తూ, ఇజ్రాయెల్‌కు అత్యధిక స్థాయిలో ఆయుధాలను అందిస్తున్నది అని పేర్కొంది. ఇరాన్ విదేశాంగ మంత్రి సయాద్ అబ్బాస్ ఆరాఘ్చీ, పశ్చిమాసియాలో యుద్ధం నివారించేందుకు తమ దేశం అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు.

ఇరు దేశాల మధ్య టెన్షన్ పెరిగిపోతుండగా, అమెరికా ఇజ్రాయెల్‌కు సపోర్ట్ గా గగనతల రక్షణ వ్యవస్థలను నిర్వహించేందుకు సైనిక బలగాలను కూడా పంపుతోంది. ఇరాన్ ఈ చర్యలకు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ, తమ ప్రజల మరియు దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. మరోవైపు పశ్చిమాసియాలో అల్లర్లు మరియు స్థిరత్వం కోల్పోయే పరిస్థితులు యుద్ధానికి దారితీస్తాయని భావిస్తున్నారు. మరి ఈ యుద్ధంలో అమెరికా ఎలాంటి పరిష్కారాన్నీ తీసుకొస్తుందో చూడాలి.

This post was last modified on October 14, 2024 11:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అప్పట్లో శ్రీలీల డేట్స్ అంటే పెద్ద ఛాలెంజ్, కానీ ఇప్పుడు…

బిజీ హీరోయిన్ల డేట్లను షెడ్యూల్స్ తగట్టు తెచ్చుకోవడం దర్శక నిర్మాతలకు ఒక్కోసారి పెద్ద సవాల్ గా మారుతుంది. అంత డిమాండ్…

28 mins ago

బోల్డ్ ఫోటోషూట్ తో కట్టి పడేస్తున్న మిల్కీ బ్యూటీ!

2007 లో విడుదలైన హ్యాపీ డేస్ మూవీతో కుర్ర కారులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్న. అగ్ర…

48 mins ago

ఆర్సీబీకి ‘హిందీ’ సెగ.. తెలుగు లేదా?

దేశవ్యాప్తంగా హిందీ భాషను రుద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తమిళనాట…

1 hour ago

నా రికార్డింగ్స్ వాడుకుంటే నీకైనా నోటీసులే : వెట్రి మారన్ తో ఇళయరాజా!

ఇళయరాజా పేరు ఈ మధ్య కాలంలో తరచుగా వివాదాలతోనే వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. వయసు మీద పడడంతో ఆయన…

1 hour ago

మెగా బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్!

ఆస్కార్ అవార్డుల్లో ఆధిపత్యం చలాయించే అన్ని సినిమాలకూ వసూళ్లు వస్తాయని గ్యారెంటీ లేదు. అలాగే వసూళ్ల మోత మోగించిన చిత్రాలకూ…

2 hours ago

ఏపీలో డ్రగ్స్ పై ‘ఈగల్’ ఐ

వైసీపీ హయాంలో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అమ్మకం, వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయాయని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో ఏ…

2 hours ago