బాలీవుడ్ తో పాటు టాలీవుడ్, దక్షిణాదిలో విలక్షణ నటుడిగా షాయాజీ షిండే మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తనదైన డైలాగ్ డెలివరీతో, టైమింగ్ తో పలు తెలుగు చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. విలన్ గా, కమెడియన్ గా, కామెడీ విలన్ గా ఎన్నో పాత్రల్లో అద్భుతంగా నటించారు. ఈ క్రమంలోనే తాజాగా షాయాజీ షిండే సినీ రంగం నుంచి రాజకీయాల వైపు అడుగులు వేశారు.
తాజాగా మహారాష్ట్రలోని ఎన్సీపీలో షాయాజీ షిండే చేరారు. ఎన్సీపీ అధ్యక్షుడు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవర్…షిండేకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలో జరగబోతున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి షాయాజీ షిండే పోటీ చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.
మహారాష్ట్ర రాజకీయాల్లో షాయాజీ షిండే ఎటువంటి ముద్ర వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో షిండే భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆలయాల్లో ప్రసాదంతోపాటు ఒక మొక్కను కూడా భక్తులకి అందిస్తే పచ్చదనం పెరుగుతుందని షాయాజీ షిండే తన అభిప్రాయాన్ని పవన్ తో పంచుకున్నారు.
తాను మహారాష్ట్రలో ఇప్పటికే మూడు ఆలయాల్లో అమలు చేశానని అన్నారు. ఈ సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతోపాటు దేశ రాజకీయాలపై కూడా వీరు చర్చించినట్లు తెలుస్తోంది. బీజేపీ హై కమాండ్ తో పవన్ కు సన్నిహిత సంబంధాలున్న నేపథ్యంలో షిండే-పవన్ ల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పుడు బీజేపీ మిత్రపక్షంగా ఉన్న ఎన్సీపీలో షిండే చేరడంతో పవన్-షిండేల భేటీ దీని గురించేనేమో అన్న చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది.
This post was last modified on October 12, 2024 12:52 pm
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…