Political News

జైల్లోనే న‌న్ను చంపాల‌ని చూశార‌ట‌: చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఒక దాని త‌ర్వాత‌..ఒక‌టి ఆయ‌న సంచ‌ల న కామెంట్ల‌తో మీడియా మీటింగ్‌ను హీటెక్కించారు. జ‌మిలికి జై కొడుతున్నామ‌ని వ్యాఖ్యానించిన చంద్ర‌బాబు.. ఇప్పుడు త‌న‌ను చంపాల‌ని కుట్ర‌ప‌న్నిన‌ట్టు త‌న‌కు తెలిసింద‌ని.. దీనిపైనే ఎక్కువ‌గా బ‌య‌ట ప్ర‌చారం కూడా జ‌రిగింద‌ని వ్యాఖ్యానించారు. జైల్లో ఉన్న‌ప్పుడు.. త‌న‌ను చంపేందుకు ప్ర‌య‌త్నించార‌ని త‌మ నాయ‌కులు చెప్పార‌న్నారు. అంతేకాదు.. త‌న క‌న్నా వైసీపీ బాధితుడు ఎవ‌రున్నారో చెప్పాల‌ని టీడీపీ నాయ‌కుల‌ను ఆయ‌న ప్ర‌శ్నించారు.

`53 రోజుల‌పాటుజైల్లో నిర్బంధించారు. క‌నీసం మంచి నీళ్లు కూడా స‌రిగా ఇవ్వ‌లేదు. ఒక్కొక్క‌సారి బోర్ వాట‌ర్ ఇస్తున్నార‌ని అనిపించింది. ఆహారం తెచ్చినా.. కూడా స‌రిగా స‌మ‌యానికి ఇవ్వ‌లేదు. జైలుపై డ్రోన్లు కూడా ఎగురవేశారు. నన్ను చంపాలని చూశారనే ప్రచారం కూడా జరిగింది. మా వాళ్లే చెప్పారు. మీడియా కూడా రాసింది. నా ప్రతీ కదలిక గమనించటానికి జైలు గదిలో సీసీ కెమెరా పెట్టారు. ఇవేంట‌ని అడిగితే ఎవ‌రూ స్పందించ‌లేదు. 14 ఏళ్లు ముఖ్య‌మంత్రిగా చేశాన‌న్న గౌర‌వం లేకుండా కొంద‌రు వ్య‌వ‌హ‌రించారు. కనీసం వేడి నీళ్లు ఇవ్వలేదు. దోమలు కుడుతుంటే కనీసం దోమ తెర లేదు“ అని చంద్ర‌బాబు పేర్కొన్నారు.

ఇంత అనుభవించినప్ప‌టికీ.. తాను బయటకు రాగానే ముందు కక్ష తీర్చుకోవాలి కదా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. అయితే.. త‌న‌ది క‌క్ష తీర్చుకునే స్వ‌భావం కాద‌న్నారు. కానీ, త‌ప్పులు చేసిన వారిని ఎట్టి ప‌రిస్థితిలోనూ వ‌దిలి పెట్టేది లేద‌న్నారు. చ‌ట్ట ప్ర‌కారం శిక్షించి తీరుతామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. ఇక‌, ఢిల్లీకి ఇన్నిసార్లు వెళ్లడం వల్లే పరిస్థితులు చక్కబడుతున్నాయని చెప్పారు. ఇంకా తమ‌ ప్రయత్నం మేం చేస్తూనే ఉంటామ‌న్నారు. త్వరలో నామినేటెడ్ పదవులు రెండో విడత భర్తీ చేప‌డ‌తామ‌ని, పార్టీలో క‌ష్ట‌ప‌డిన వారికి గుర్తింపు ఉంటుంద‌న్నారు.

గత ఐదేళ్లలో అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడింది తానేని, ఈ విష‌యాన్ని పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు కూడా గుర్తు పెట్టుకోవాల‌ని ప‌రోక్షంగా ఆయ‌న ప‌ద‌వులు ఆశిస్తున్న‌వారిని హెచ్చ‌రించారు. అయితే.. గత ఐదేళ్లు ఇబ్బందులు పడిన వారి బాధలు త‌న‌కు తెలుసున‌ని, అంద‌రికీ న్యాయం జ‌రుగుతుంద‌ని కాక‌పోతే.. కొంచెం ఓపిక ప‌ట్టాల‌ని వ్యాఖ్యానించారు. ఎవ‌రు ఏం చేస్తున్నారో.. ఎలా ఉన్నారో.. అని ప్ర‌తిసారి స‌ర్వేల రూపంలో స‌మాచారం తెప్పించుకుంటున్న‌ట్టు తెలిపారు.

This post was last modified on October 10, 2024 12:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇకపై ఆలస్యం చేయను – అల్లు అర్జున్

ఒకే సినిమాపై సంవత్సరాల తరబడి ఖర్చు చేయడం బాహుబలి నుంచే మొదలయ్యిందని చెప్పాలి. గతంలో అంజి, అమ్మోరు లాంటివి సుదీర్ఘ…

14 mins ago

పుష్ప 2 సెన్సార్ అయిపోయిందోచ్ : టాక్ ఎలా ఉందంటే…

ఐకాన్ స్టార్ అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్…

3 hours ago

అప్పట్లో శ్రీలీల డేట్స్ అంటే పెద్ద ఛాలెంజ్, కానీ ఇప్పుడు…

బిజీ హీరోయిన్ల డేట్లను షెడ్యూల్స్ తగట్టు తెచ్చుకోవడం దర్శక నిర్మాతలకు ఒక్కోసారి పెద్ద సవాల్ గా మారుతుంది. అంత డిమాండ్…

3 hours ago

బోల్డ్ ఫోటోషూట్ తో కట్టి పడేస్తున్న మిల్కీ బ్యూటీ!

2007 లో విడుదలైన హ్యాపీ డేస్ మూవీతో కుర్ర కారులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్న. అగ్ర…

4 hours ago

ఆర్సీబీకి ‘హిందీ’ సెగ.. తెలుగు లేదా?

దేశవ్యాప్తంగా హిందీ భాషను రుద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తమిళనాట…

4 hours ago

నా రికార్డింగ్స్ వాడుకుంటే నీకైనా నోటీసులే : వెట్రి మారన్ తో ఇళయరాజా!

ఇళయరాజా పేరు ఈ మధ్య కాలంలో తరచుగా వివాదాలతోనే వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. వయసు మీద పడడంతో ఆయన…

4 hours ago