అక్కినేని నాగార్జున కుటుంబంపై తెలంగాణ సీనియర్ మంత్రి, పైగా మహిళా నాయకురాలు కొండా సురేఖ చేసిన అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయంగానే కాకుండా.. సామాజికంగా కూడా తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యల పర్యవసానం ఎలా ఉన్నా.. అన్ని వర్గాల ప్రముఖులు, సాధారణ ప్రజలు కూడా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఎవరూ సమర్థించడం లేదు. ఈ క్రమంలో ఆయా వర్గాలు అక్కినేని కుటుంబానికి అండగా నిలిచాయి.
ముఖ్యంగా టాలీవుడ్ అయితే.. మీడియా సమావేశం పెట్టి మరీ సురేఖ తీరును ఎండగట్టే ప్రయత్నం చేసింది. అయితే.. అప్పటికే సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్న ప్రకటించిన నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు ప్రెస్‌మీట్‌ను వాయిదా వేసుకున్నారు. కానీ, సోషల్ మీడియా వేదికగా మాత్రం సురేఖ తీరుపై నిప్పులు చెరిగారు. వారు వీరు అనే తేడా లేకుండా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు నాగార్జున కుటుంబానికి సన్నిహితంగా ఉన్న నటులు, ఇతర ఆర్టిస్టులు కూడా ఖండించారు.
ఇది మంచి పరిణామమే. ఒక్క కాకికి కష్టం వస్తే.. మిగిలిన కాకులు కూడా ఏకమైనట్టుగా టాలీవుడ్ కలిసి రావడాన్ని అందరూ హర్షిస్తున్నారు. కానీ, ఇక్కడే చిన్న చిక్కు వచ్చింది. గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో చిరంజీవి సహా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఆ పార్టీ నాయకులు తీవ్రస్థాయి లో దుర్భాషలాడినప్పుడు ఈ టాలీవుడ్ నుంచి ఒక్కరూ స్పందించలేదన్నదే ఇప్పుడు ప్రశ్న. ఇప్పుడు ఇది ప్రస్తావనార్హం కాకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఆగడం లేదు.
నాడు మౌనంగా ఎందుకున్నారన్నది ఇప్పుడు ప్రశ్న. మెగా కుటుంబంలోని చిరు మాతృమూర్తి నుంచి అనేక మందివైసీపీ నాయకులు దుర్భాషలాడారని, అప్పట్లో ఈ టాలీవుడ్ ఎందుకు స్పందించలేదని సోషల్ మీడియా జనాలు నిప్పులు చెరుగుతున్నారు. సహజంగానే ఇలాంటివి ఒక్కరితో పోవు.. తర్వాత పాకుతాయి.. అనడానికి కొండా సురేఖ ఉదంతాన్నివారు ఉదాహరణగా పేర్కొంటున్నారు. అప్పట్లోనే టాలీవుడ్ స్పందించి కఠినంగా వ్యవహరించి ఉంటే.. ఇప్పుడు తెలంగాణ ఉదంతం జరిగి ఉండేది కాదన్నది సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ.
This post was last modified on October 3, 2024 7:54 pm
అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో…
మాజీ సీఎం జగన్, వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకపోవడంపై ఏపీ శాసన మండలి సమావేశాల్లో పెను దుమారం రేగింది. జగన్…
వైసీపీ ఎంపీగా గెలిచిన కొద్ది నెలల తర్వాత ఆ పార్టీపై రఘురామకృష్ణరాజు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. నాలుగేళ్లపాటు…
వైసీపీ హయాంలో ఆ పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులు సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యులపై పెట్టిన…
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరి ఆరు మాసాలు కూడా కాలేదు. కేవలం ఐదు మాసాలు మాత్రమే పూర్తయింది. కానీ,…
వంశీ పైడిపల్లికి యావరేజ్ డైరెక్టర్ అని పేరుంది. అతను గొప్ప సినిమాలేమీ తీయలేదు. కానీ.. అతను కెరీర్లో ఇప్పటిదాకా పెద్ద…