టీడీపీ అధినేత చంద్రబాబును అనేక వేదికలపై చూసి ఉంటారు. అనేక ఆలయాల్లోనూ సభల్లోనూ చూసి ఉంటారు. తన సుదీర్ఘ ముఖ్యమంత్రి పదవిలో అనేక కార్యక్రమాల్లోనూ చంద్రబాబు పాల్గొన్నారు.
కానీ, చంద్రబాబు 4.0లో మాత్రం ఆయన చాలా భిన్నంగా కనిపిస్తున్నారు. తనదైన శైలికి భిన్నంగా ఆయన ప్రజలకు చేరువ అవుతున్నారు. కార్యక్రమాల ప్రాధాన్యాన్ని అనుసరించి తనను తాను మార్చుకుంటున్నారు. మరింత ప్రజాదరణ గల నాయకుడిగా తీర్చి దిద్దుకుంటున్నారు.
ప్రతి నెల 1వ తేదీన ఇచ్చే సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు స్వయంగా పాల్గొంటున్నారు. పేదల ఇళ్లకు వెళ్లి వారికి స్వయంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. పేదల ఇళ్లలో వారు ఆ సమయానికి ఏది ఇస్తే.. దానిని తీసుకుంటున్నారు.
కొన్ని ఇళ్లలో టీ ఇస్తే.. మరికొందరు మజ్జిగ ఇస్తు న్నారు. ఇలా ఏది ఇచ్చినా చంద్రబాబు కాదనకుండా తీసుకుంటున్నారు. తాజాగా అక్టోబరు 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని చంద్రబాబు మచిలీపట్నం నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఎన్డీయే కూటమి పార్టీల ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాస్ట్రాల్లో స్వచ్చతే సేవ నినాదంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏపీ లోనూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
మచిలీపట్నంలో నిర్వహించిన స్వ చ్ఛతే సేవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పారిశుద్ధ్య కార్మికుల తో కలిసి కూర్చుని.. వారు తయారు చేసిన టీనీ స్వయంగా రుచి చూశారు. వారి బాగోగులు తెలుసుకు న్నారు.
పారిశుద్ధ్య కార్మికులుగా వారు ఎదుర్కొంటున్న కష్టాలు కూడా తెలుసుకున్నారు. వారి పక్కనే చాలా సేపు కూర్చుని వారితో మాటలు కలిపారు. టీ తాగుతూ.. వారితో ముచ్చటించారు. నిజానికి 14 ఏళ్ల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి.. తమ పక్కన కూర్చుని ఇలా ముచ్చటించడంతో కార్మికుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వారు ఎంతగానో మురిసిపోయారు.