తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని వినియోగిస్తున్నారన్న విమర్శలు, ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తన పనిని ఆపేసింది. వాస్తవానికి గత రెండు రోజులుగా ఇదే పనిపై సిట్ ఉన్న విషయం తెలిసిందే. సిట్ అధిపతి సర్వశ్రేష్ఠ త్రిపాఠీ స్వయంగా రంగంలోకి దిగి.. తిరుమలలో పర్యటించి.. లడ్డూ తయారు చేసే పోటు ప్రాంతాన్ని పరిశీలించారు. అదేవిధంగా తిరుమలకు వివిధ ప్రాంతాల నుంచి కాంట్రాక్టుపై నెయ్యిని తీసుకువచ్చే ట్యాంకర్లను కూడా ఆయన పరిశీలించారు. అధికారులను కూడా సంప్రదించి ఏం జరుగుతోందో తెలుసుకున్నారు.
ఈ సిట్ దర్యాప్తు మరింత దూకుడుగా ముందుకు సాగుతున్న సమయంలో అనూహ్యంగా ఈ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం బ్రేక్ వేసింది. ఈ విషయాన్ని స్వయంగా డీజీపీ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు. సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం.. వాటిపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు సిట్ దర్యాప్తును నిలుపుదల చేయాలని నిర్ణయించుకున్నట్టు ద్వార కా తిరుమల రావు తెలిపారు. అంతేకాదు.. ఈ నెల 3న సుప్రీంకోర్టు ఇచ్చే మార్గదర్శకాల మేరకు ముందుకు సాగుతామన్నారు.
ఇదిలావుంటే.. సిట్ ఎందుకు వేయాల్సి వచ్చిందనే విషయాన్ని డీజీపీ తిరుమలరావు ప్రస్తావిస్తూ.. కేసు తీవ్రత ఎక్కువగా ఉంద ని.. కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం కావడంతో ప్రభుత్వం సూచనల మేరకు సిట్‌ను ఏర్పాటు చేసినట్టు డీజీపీ వివరించారు. దర్యాప్తును నిష్పక్షపాతంగా జరిపిస్తామని.. రాజకీయ జోక్యానికి తావు ఉండదని పేర్కొన్నారు. అయితే.. ఈ కేసును సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించిన నేపథ్యంలో ఆ కోర్టు ఆదేశాల మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ నేపథ్యంలోనే సిట్ దర్యాప్తును ఈ నెల 3వ తేదీ వరకు నిలుపుదల చేస్తున్నట్టు వివరించారు.
ఏఆర్ సంస్థపై కేసు
తిరుమలకు నెయ్యిని సరఫరా చేసిన తమిళనాడులోని దుండిగల్ కు చెందిన ఏఆర్ సంస్థపై కేసు నమోదైనట్టు డీజీపీ తెలిపారు. నెయ్యి కల్తీ సహా.. ఆహార పదార్థాల నాణ్యతపైనా ఫిర్యాదులు రావడంతోనే కేసు నమోదు చేశామన్నారు. అయితే.. నోటీసులు ఇవ్వలేదన్న ఆ సంస్థ యజమాని రాజశేఖరన్ వాదనలపై స్పందించేందుకు డీజీపీ నిరాకరించారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణ పరిధిలో ఉందని.. కాబట్టి దీనిపైకోర్టు సూచనల మేరకు ముందుకు వెళ్తామన్నారు.
This post was last modified on October 2, 2024 12:54 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…