తెలంగాణలో మరో వివాదం తెరమీదికి వచ్చింది. ప్రస్తుత మంత్రి కొండా సురేఖ, బీజేపీ ఎంపీ రఘునందనరావు కలిసి ఉన్న ఫొటోను అభ్యంతరకర రీతిలో చిత్రీకరించి.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీని వెనుక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నాయకులు ఉన్నారనేది కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ. దీనిపై సోమవారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున వివాదం రాజుకుంది. బీఆర్ఎస్ భవన్ దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు, కొండా సురేఖ వర్గం ఆందోళనకు దిగారు. కేటీఆర్, కేసీఆర్ దిష్టబొమ్మలను కూడా తగుల బెట్టే ప్రయత్నం చేశారు. ఇదిలావుంటే.. మీడియా ముందుకు వచ్చిన సురేఖ కన్నీరు పెట్టుకున్నారు.
రఘునందనరావు-తాను పాల్గొన్న ఓ కార్యక్రమంలో తీసిన ఫొటోను అభ్యంతరకర రీతిలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడం ఏంటని ఆమె ప్రశ్నించారు. అంతేకాదు.. కేటీఆర్ కుటుంబంలోనూ అమ్మ, చెల్లి ఉన్నారని, వారికి ఈ ఫొటో చూపించి.. సరైందనేని అనిపించాలని సవాల్ రువ్వారు. ఒక కుటుంబం, బాధ్యత ఉన్నవారు.. ఈ పనిని చేయబోరని చెప్పారు. ఫొటోను మార్ఫింగ్ చేసి.. దానికి “వీళ్లకు షాదీ ముబారక్ ఎవరు ఇచ్చారు?” అని ప్రశ్నించడం ఎంత జుగుప్సాకరమో ఆలోచించుకోవాల ని సురేఖ వ్యాఖ్యానించారు. ఈ ఫొటో చూసిన తర్వాత.. తనకు నిద్ర పట్టలేదని, అన్నం కూడా తినలేదని చెప్పారు.
బీఆర్ఎస్‌కు వార్నింగ్
కొండా సురేఖ.. బీఆర్ఎస్ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. “బీఆర్ఎస్ నాయకులారా ఖబడ్దార్. అసహ్యంగా పోస్టులు పెడితే ఇక ఊరుకునేది లేదు” అని వ్యాఖ్యానించారు. అధికారం పోయిందని బీఆర్ఎస్ వాళ్లు తమకు నచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని దుయ్యబట్టారు. ఈ ఫొటో తనను మానసికంగా కుంగదీసిందన్నారు. “నీ ఇంట్లో చెల్లిని ఇలాగే అంటే ఊరుకుంటారా? పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు” అని కొండా సురేఖ నిప్పులు చెరిగారు. ఇలాంటి వారిని సమర్థిస్తున్న కేటీఆర్‌కు ఇప్పటికైనా బుద్ధి రావాలని అన్నారు. కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే.. ‘బట్టలిప్పి ఉరికిస్తాం’ అని సురేఖ వార్నింగ్ ఇచ్చారు.
ఏం జరిగింది?
ఓ అధికారిక కార్యక్రమంలో బీజేపీ ఎంపీ రఘునందనరావు.. మంత్రి కొండా సురేఖలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేఖ మెడలో రఘునందనరావు.. ‘చేనేత నూలు దండ’ వేశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనికి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతోపాటు.. విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు. దీనిపైనే కొత్త రాజకీయం అలుముకుంది. దీనిని సీరియస్‌గా తీసుకున్న సురేఖ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
This post was last modified on September 30, 2024 9:23 pm
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…
‘అర్జున్ రెడ్డి’ అనే చిన్న సినిమాతో సందీప్ రెడ్డి వంగ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సినిమా…
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో…
సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ తాజాగా నోటీసులు జారీ చేసింది. కోటీ 15 లక్షల…
ఇవాళ అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటున్న గేమ్ ఛేంజర్ మీద తెలంగాణ అసెంబ్లీ పెద్ద బాంబు వేసింది. సంధ్య…